Covid 19 Third Wave: కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?

Covid 19 Third Wave: కోవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చర్యలు కొనసాగుతున్నాయి. గత ఏడాది నుంచి అతలాకుతలం చేస్తున్న కరోనా.. సెకండ్‌వేవ్‌లో..

Covid 19 Third Wave: కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?
Follow us

|

Updated on: Jun 14, 2021 | 9:35 AM

Covid 19 Third Wave: కోవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చర్యలు కొనసాగుతున్నాయి. గత ఏడాది నుంచి అతలాకుతలం చేస్తున్న కరోనా.. సెకండ్‌వేవ్‌లో తీవ్ర స్థాయిలో విజృంభించింది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌, లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి. అయితే కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కరోనా సోకినా పెద్దగా ప్రమాదం ఉండదు. ఐసీయూలకు వెళ్లేంత పరిస్థితి ఉండదు. వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల వైరస్‌ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్‌ ఎందగానో దోహదపడుతుంది. కొన్ని దేశాలలో సెకండ్‌వేవ్‌కంటే థర్డ్‌వేవ్‌ తీవ్రంగా ఉన్నప్పటికీ, వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదం ఉండటం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల కరోనా కేసులను నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇక కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేసింది. ప్రతి ఒక్కరికి టీకా వేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత లేకుండా కేంద్ర సర్కార్‌ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పుడు దేశంలో ఉన్న 64 కోట్ల మందికి త్వరగా టీకాలు వేసే దానిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి

కేంద్ర ప్రభుత్వం భారతీయ, విదేశీ వ్యాక్సిన్లను సాధ్యమైనంత వరకు సరసమైన ధరలకు విక్రయించాలి. భారత్‌లో తయారైన వ్యాక్సిన్లు ఖరీదైనవి అయినప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులకు కూడా వ్యాక్సిన్ల సరఫరాలో చర్యలు తీసుకోవాలి. వ్యాక్సిన్‌ ఖర్చులు కొంత ప్రభుత్వాలే భరించి తక్కువ ధరకు ప్రైవేటు ఆస్పత్రులకు విక్రయించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అయితే భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌లలో 75శాతం ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు చేసింది. ఇది 100 శాతం వరకు పూర్తి చేయాలి. తర్వాత ప్రైవేటు ఆస్పత్రులకు టీకాలు సరఫరాలో చర్యలు చేపట్టాలి.

టీకాల ఉత్పత్తిని పెంచడానికి నాణ్యైన విదేశీ వ్యాక్సిన్లను సేకరించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. థర్డ్ వేవ్‌లో మరింత మంది కరోనా బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా వ్యాక్సిన్లను సరఫరా చేయాలి. అలాగే ప్రైవేటు ఆస్పత్రులకు, క్లినిక్‌లకు తక్కువ ధరకే వ్యాక్సిన్‌లను పంపిణీ చేయాలి. ప్రభుత్వమే పంపిణీ చేయడం ద్వారా మధ్యవర్తిత్వలు ఉండవు. వ్యాక్సిన్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా ఉంటుంది. ఇక ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు పారదర్శకంగా టీకాలు వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపయోగంగా ఉంది. వ్యాక్సిన్‌లను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని రిఫ్రిజిరేటర్‌లో 10 రోజులు మించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్పత్రులు ప్రతి పది రోజులకోసారి టీకా నిల్వను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలి. ఫ్రిజ్‌లో ఉంచిన వ్యాక్సిన్లు పది రోజుల కంటే ఎక్కువ రోజు ఉండే అవకాశం ఉంటే అలాంటి వ్యాక్సిన్లు ఇతరులకు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

ఒక ఆస్పత్రి నిల్వ ఉన్న టీకాలను పది రోజుల్లో వేయకపోతే ఆ టీకాలను ఇతర ఆస్పత్రులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇతర ఆస్పత్రుల్లో టీకాల కొరతను నివారించవచ్చు. లేకపోతే వృథాపోయే అవకాశం ఉంటుంది. టీకాలు వేయడం అనేది వైద్య విధానంలో 24/7 సేవగా మార్చాలి. ఏ సమయంలోనైనా టీకాలు వేసే విధంగా నిరంతర సేవగా మార్చాలి. అర్ధరాత్రి సమయాల్లో కూడా టీకాలు వేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కోల్‌కతాలోని నర్సులు ఒక నిమిషానికి ఏడుగురికి టీకాలు వేస్తామని నిరూపించుకున్నారు. టీకా వేయడంలో అక్కడ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నర్సులపై వైద్య సిబ్బంది అభినందించారు. వేగంగా టీకాలు ఇవ్వడంలో నర్సులు ప్రశంసలు అందుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ వ్యాక్సిన్లను ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర క్లినిక్‌లకు వ్యాక్సిన్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. దీని వల్ల మరింత మందికి వ్యాక్సిన్లు వేయడం సులభతరం అవుతుంది. ప్రభుత్వం ఆస్పత్రుల్లో 2 నుంచి 3 లక్షల మంది నర్సులను మాత్రమే నియమించింది. తక్కువ సిబ్బందితో టీకాలు వేయడం చాలా కష్టం. ఎక్కువ సిబ్బందిని నియమించి ఎక్కువ మొత్తంలో టీకాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ధరలకు టీకాలు వేయడం అనేది నివారించాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసే టీకాల ఖర్చు ప్రభుత్వం భరించినట్లయితే ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా టీకాలు వేసేందుకు ముందుకు వస్తాయి. టీకాలు వేయడం అనేది నిరంత ప్రక్రియ కొనసాగేలా చూడాలి. బెంగళూరు వంటి నగరాల్లో 21 శాతం జనాభా మురికి వాడల్లో నివసిస్తున్నారు. అలాంటి వారికి వేగంగా టీకాలు వేస్తే ఎంతో మేలు ఉంటుంది.

చాలా కంపెనీలు తమ తమ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు టీకాలు వేయవచ్చు. అలాగే ధనవంతుల ఇళ్లల్లో ఉన్న పని మనుషులు, డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేయాలి. లాక్‌డౌన్‌ కారణంగా పట్టణ పేదలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అవగాహన కల్పించాలి.

ఉచితంగా వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కార్యాలయాలు, ప్రజా రవాణా మరియు వినోద సౌకర్యాల వద్ద కూడా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేయాలి. కోవిడ్‌ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కుటుంబ యజమాని కోవిడ్‌ వల్ల మరణించడంలో ఆ కుటుంబం రోడ్డున పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే కోవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించి ఎవరికి వారు అవగాహన పెంచుకుని కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడు థర్డ్‌ వేవ్‌ కాకుండా మరిన్ని వేవ్‌లు వచ్చినా ఎదుర్కొగలరు.

ఇవీ కూడా చదవండి:

Covid Vaccine: నమ్మండి..! వ్యాక్సిన్ వేసుకుంటే మీరు సేఫ్.. తాజా అధ్యయనంలో వెల్లడి

Covid19 Vaccine: దేశవ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్.. దిగివస్తున్న కరోనా కేసులు.. ఇప్పటికి ఎంతమందికి టీకా అందిందంటే..!