Covid19 Vaccine: దేశవ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్.. దిగివస్తున్న కరోనా కేసులు.. ఇప్పటికి ఎంతమందికి టీకా అందిందంటే..!
దేశ ప్రజలకు గుడ్ న్యూస్. కరోనా కేసులు స్పీడ్‌గా తగ్గి పోతున్నాయి. దేశంలో ఐదో రోజు కరోనా కేసులు లక్షలకు దిగువన నమోదు అయ్యాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెరిగింది.
Covid 19 Vaccination in India: దేశ ప్రజలకు గుడ్ న్యూస్. కరోనా కేసులు స్పీడ్‌గా తగ్గి పోతున్నాయి. దేశంలో ఐదో రోజు కరోనా కేసులు లక్షలకు దిగువన నమోదు అయ్యాయి. గతంలో లేనంత రికవరీలు కూడా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా తాజాగా 84 వేల 332 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న 4 వేల మంది మృత్యు ఒడికి చేరుకోగా.. మొత్తం మరణాల సంఖ్య 3 లక్ష 67 వేలకు చేరుకుంది. ఇక దేశంలో క్రియాశీల రేటు 4 శాతం దిగువకు చేరగా.. రికవరీ రేటు 95 శాతానికి చేరువైంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఊహించినంత వేగంగా సాగకపోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 కోట్ల 61 లక్షల 88 వేల 67 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 19 కోట్ల 96 లక్షల 55 వేల 293 మందికి మొదటి డోస్ అందగా.. 4 కోట్ల 65 లక్షల 32 వేల 774 మందికి రెండో డోస్ పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 9 లక్షల 97 వేల 65 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
ఏపీలో ఇప్పటి వరకు కోటి 17 లక్షల 33 వేల 150 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 91 లక్షల 20 వేల 712 మందికి మొదటి డోస్ అందగా.. 26 లక్షల 12 వేల 438 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 76 లక్షల 77 వేల 993 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్ పూర్తైన వారు 63 లక్షల 40 వేల 222 మంది ఉండగా.. రెండో డోస్ పూర్తైన వారు 13 లక్షల 37 వేల 771 మంది ఉన్నారు.
ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 21 కోట్ల 66 లక్షల 1 వేల 889 మందికి covisheild అందితే.. 2 కోట్ల 95 లక్షల 62 వేల 737 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి.
18 ఏళ్ల పై బడిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 28 కోట్ల 6 లక్షల 80 వేల 420 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 11 కోట్ల 70 లక్షల 6 వేల 100 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 16 కోట్ల 36 లక్షల 74 వేల 320 మంది 45 ఏళ్ల పై బడిన వారు.
అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.. కరోనా మహమ్మారిని దరిచేరనివ్వకండీ..! Read Also… Husband Caught His Wife: ప్రియుడితో కలిసి భార్య రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..!