Chicken Lollipops: నోరూరించే రుచికరమైన చికెన్ లాలిపాప్స్.. ఇక ఇంట్లోనే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి..

Chicken Lollipops: ప్రతి భారతీయ రెస్టారెంట్ స్నాక్స్ మెనూలో బాగా ప్రాచుర్యం పొందిన ఇండియన్ చికెన్ డిష్ పక్కా ఉంటుంది. వెల్లుల్లి, అల్లం పేస్ట్, పిండి...

Chicken Lollipops: నోరూరించే రుచికరమైన చికెన్ లాలిపాప్స్.. ఇక ఇంట్లోనే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి..
Chicken Lolipops
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 13, 2021 | 8:16 AM

Chicken Lollipops: ప్రతి భారతీయ రెస్టారెంట్ స్నాక్స్ మెనూలో బాగా ప్రాచుర్యం పొందిన ఇండియన్ చికెన్ డిష్ పక్కా ఉంటుంది. వెల్లుల్లి, అల్లం పేస్ట్, పిండి మిక్సింగ్ పేస్ట్‌ని అప్లై చేసిన చికెట్ లాలిపాప్స్‌ని తయారు చేస్తారు. ఇక అలా తయారీ చేసిన చికెన్ లాలీపాప్‌లను షెచువాన్ సాస్‌తో వడ్డిస్తారు. అయితే, ఈ లాలిపాప్స్‌ కోసం మీరు ఏ హోటల్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈ చికెన్ డిష్‌ని తయారు చేసుకోవచ్చు. సులభమై, త్వరగా ఈ చికెన్ రెసిపీని తయారు చేసుకోని మంచి దావత్ చేసుకోవచ్చు. ఇంట్లోనే సులభమైన పద్ధతిలో రుచికరమైన చికెన్ లాలిపాప్స్‌ని ఎలా తయారు చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ లాలిపాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు.. 1. 6 చికెన్ పీస్‌లు 2. ఒక గుడ్డు 3. ఒక కప్పు కార్న్‌స్టార్చ్ / కార్న్‌ఫ్లోర్ 4. ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ 5. ఒక స్పూన్ అల్లం పేస్ట్ 6. ఒక స్పూన్ ఉప్పు 7. సరిపడినంత నూనె

చికెన్ లాలిపాప్స్ ఎలా తయారు చేయాలి.. ఒక గిన్నెలో చికెన్, గుడ్డు, కార్న్‌ఫ్లోర్, వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఒక స్పూన్ ఉప్పు, తగినంత నీరు కలపండి. అలా ఆ పదార్థాన్నంతా చికెన్ ముక్కలకు పట్టించాలి. ఆ తరువాత వాటిని ఒక గంట సమయం పాటు గిన్నెలో అలాగే ఉంచాలి. నూనె వేడి చేసి, చికెన్ రెక్కలను అధిక వేడి వద్ద డీప్ ఫ్రై చేయాలి. ఆ తరువాత కొద్దిగా మంటను తగ్గించి ముక్కలు ఉడికేంత వరకు ఫ్రై చేయాలి. ముక్కులు ఉడికిన తరువాత ఆయిల్ పీల్చుకునేందుకు ఓ కాగితంపై వాటిని వేయడం మంచిది. ఇక వడ్డించే ముందు, నూనెను మరొక్కసారి వేడి చేసి ఆ చికెన్ లాలిపాప్స్‌ని వేడి నూనెలో గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తరువాత సర్వ్ చేయాలి.

Also read:

Diet Tips For Piles: పైల్స్‌తో నరకం చూస్తు్న్నారా?.. మనం తినే ఆహారంతోనే చెక్ పెట్టండి ఇలా..!