Weight Loss Tips: బరువు తగ్గడం కోసం డైట్ చేసేవారు ఈ పండ్లను తింటే మరింత బరువు పెరుగుతారట

Weight Loss Tips:పండ్లు ఆరోగ్యానికి మేలు.. ముఖ్యంగా చాలా మంది బరువు తగ్గడానికి డైట్ చేస్తున్న సమయంలో ఎక్కువగా పండ్లు తింటూ.. మిగతా ఆహారాన్ని తగ్గిస్తారు..

Weight Loss Tips: బరువు తగ్గడం కోసం డైట్ చేసేవారు ఈ పండ్లను తింటే మరింత బరువు పెరుగుతారట
Fruits
Follow us
Surya Kala

|

Updated on: Jun 13, 2021 | 11:39 AM

Weight Loss Tips:పండ్లు ఆరోగ్యానికి మేలు.. ముఖ్యంగా చాలా మంది బరువు తగ్గడానికి డైట్ చేస్తున్న సమయంలో ఎక్కువగా పండ్లు తింటూ.. మిగతా ఆహారాన్ని తగ్గిస్తారు. అన్నం, టిఫిన్ తగ్గించి పండ్లు తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే డైట్ లో ఉన్న సమయంలో కొన్ని పండ్లు తింటే బరువు తగ్గడం మాట అటుంచి మరింత బరువు పెరుగుతాం.. అందుకనే తప్పని సరిగా బరువు తగ్గాలనుకునే వారు డైటింగ్ లో ఉన్నసమయంలో ఈ పండ్లు తినకూడదు..

అరటి పండ్లు :

అన్ని సీజన్లలో లభిస్తాయి,ఆ అంతేకాదు పండ్లలో అన్నిటికంటే చౌకగా దొరికేవి అరటిపండ్లు. అయితే ఈ అరటిపండ్లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గడం కోసం డైట్ చేసేవారు ఆకలి వేయదని ప్రతిరోజూ 2 నుండి 3 అరటి పళ్ళు తింటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు.

మామిడి పండు:

పండ్లలో రారాజు మామిడి పండ్లు. వేసవిలో లభించే మామిడి పండ్లను ఇష్టపడేవారు ఉండరు. అయితే డైట్ లో ఉన్నవారు మాత్రం ఈ పండును తినకూడదట..ఒక కప్పు మామిడి పండులో లో కేలరీలు 99 ఉంటాయి కనుక బరువు తగ్గాలని అనుకునేవారు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి

ద్రాక్ష:

వీటిల్లో ఎక్కువ కేలరీలు, అధికంగా చక్కెర శాతం ఉంటాయి. దీంతో వీటిని రోజూ తింటే బరువు పెరిగేలా చేస్తుంది.

అవకాడో:

అవకాడో లో కూడా అధిక కేలరీలతో పాటు.. ఆరోగ్యకరమైన ఫ్యాట్ కూడా ఉంటుంది. 100 గ్రాముల అవకాడో లో 160 కేలరీలు ఉంటాయి. అందుకని వీటిని అప్పుడప్పుడు తీసుకోవాలి కానీ డైట్ లో ఉన్నవారు రోజూ తింటే బరువు పెరగటం ఖాయం

ఎండుద్రాక్ష:

డైట్ లో ఉన్నవారు ఎండు ద్రాక్షను దూరం పెట్టడం మంచిది. ఒక కప్పు ఎండుద్రాక్ష 500 కేలరీల ను కలిగి ఉంటుంది. ఇది ఖచ్చితంగా బరువు పెరిగేలా చేస్తుంది. అందువల్ల, డైటింగ్ చేసేటప్పుడు ఎండుద్రాక్ష కు ఎంత దూరంగా ఉంటె అంత మంచిది.

Also Read: ఓ వైపు స్పాకెళ్లి బడీ మసాజ్ చేయించుకున్న గుడ్లగూబ.. మరోవైపు ఐలవ్ యూ అంటున్న రామచిలుక

.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!