Viral Videos: ఓ వైపు స్పాకెళ్లి బాడీ మసాజ్ చేయించుకున్న గుడ్లగూబ.. మరోవైపు ఐలవ్ యూ అంటున్న రామచిలుక
Viral Videos: సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. పిల్లి, కుక్క, వంటి పెంపుడుజంతువులావె కాదు ఏనుగు, సింహం, ఎలుగుబంటి..
Viral Videos: సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. పిల్లి, కుక్క, వంటి పెంపుడుజంతువులావె కాదు ఏనుగు, సింహం, ఎలుగుబంటి వంటి అడవి జంతువుల అందమైన క్షణాలు కెమెరాలో బంధించి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అవి ఎంతగానో చూపరుల హృదయాన్ని సంతోషపరుస్థాయి. ఎవరైనా ఒత్తిడికి గురైనప్పుడు చాలా సార్లు, ఇలాంటి వీడియోలు చూడటం మనసుకు ఉపశమనం ఇస్తుంది. ఇటువంటి వీడియోలు చాలా వేగంగా వైరల్ అవుతాయి. తాజాగా ఓ రెండు పక్షులు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకటి గుడ్ల గూబ స్నానం కోసం స్పా కి వచ్చి న వీడియో కదా మరొకటి అందమైన రామచిలుక పలికే పలుకులు
గుడ్లగూబ వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది. ఈ గుడ్లగూబ స్పా లో చికిత్స పొందుతోంది. గుడ్ల గూబకి బాడీ మసాజ్ చేసిన తర్వాత రిలాక్స్ అవుతుంది. అంతేకాదు ఆ గుడ్లగూబను చుస్తే.. స్పా లో చేయించిన స్నానంతో మరింత గ్లో వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో ట్విట్టర్ ఖాతా బ్యూటెంగేబీడెన్‌లో షేర్ చేశారు.
Owl getting a spa treatment.. pic.twitter.com/GSODYU83DW
— Buitengebieden (@buitengebieden_) June 12, 2021
ఓ పక్షి ముద్దుముద్దుగా చెప్పేమాటల వీడియో ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేశారు. ఈ పక్షి తన మాటలతో కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ ను లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ పక్షి పేరు ఆర్లో.. పసిఫిక్ కు చెందిన 2 సంవత్సరాల చిలుక. ఇది హ్యూమన్ జెన్నిఫర్ అంటూ ఆ వీడియో కి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆర్లో ‘నేన్ను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ చెప్పే మాటలు మీదని స్పెషల్ ఇమేజ్ ను తెచ్చింది.
View this post on Instagram
Also Read : 50 మంది నిరుపేద చిన్నారులను దత్తత తీసుకుని చదివిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్