MS Dhoni: చిన్ని గుర్రంతో ఆటలాడిన ధోని.. నెట్టింట వీడియో వైరల్..
MS Dhoni viral video: చెన్నై సూపర్ కింగ్స్ రధసారథి మహేంద్రసింగ్ ధోని.. ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుంటాడు. కరోనా ఉద్ధృతి కారణంగా
MS Dhoni viral video: చెన్నై సూపర్ కింగ్స్ రధసారథి మహేంద్రసింగ్ ధోని.. ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుంటాడు. కరోనా ఉద్ధృతి కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఖాళీ సమయం దొరకడంతో ధోని రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో సేదతీరుతున్నాడు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో సరదాగా బిజిబిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో తన ఫామ్‌హౌజ్‌లో పెంచుకుంటున్న మూగజీవాలతో సరదాగా గడిపేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నాడు.
గతనెల ఓ చిన్న గుర్రానికి మసాజ్, స్నానం చేయించిన ధోనీ.. తాజాగా మరో చిన్న గుర్రంతో ఆటలాడుతూ కనిపించాడు. దానితో పరుగులు తీస్తున్న వీడియోను ధోని అర్ధాంగి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంకేముంది ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన అభిమానులంతా పలు కామెంట్లు చేస్తూ.. లైకులు మీద లైకులు కొడుతున్నారు.
View this post on Instagram
ధోనీ 2019 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో చెన్నై సారథిగా కొనసాగాడు. అయితే.. ఈ సీజన్‌లో టోర్నీ పూర్తయ్యేసరికి చెన్నై ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అయితే.. మిగతా సీజన్ సెప్టెంబర్‌లో జరిగే అవకాశమున్నట్లు బీసీసీఐ వర్గాలు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.
Also Read: