AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggu Bhai: ఆనందయ్య మందు ఎఫెక్ట్.. ‘అమ్మ నాటీ..’ అంటూ జగ్గూభాయ్‌కి బాబు గోగినేని కౌంటర్..

Jaggu Bhai: సినీ నటుడు, హీరో కమ్ విలన్ జగపతిబాబు‌పై ప్రముఖ హేతువాది బాబు గోగినేని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Jaggu Bhai: ఆనందయ్య మందు ఎఫెక్ట్.. ‘అమ్మ నాటీ..’ అంటూ జగ్గూభాయ్‌కి బాబు గోగినేని కౌంటర్..
Babu Gogineni
Shiva Prajapati
|

Updated on: Jun 13, 2021 | 7:56 AM

Share

Jaggu Bhai: సినీ నటుడు, హీరో కమ్ విలన్ జగపతిబాబు‌పై ప్రముఖ హేతువాది బాబు గోగినేని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో జగపతి బాబు చేసిన కామెంట్స్‌ని పట్టుకుని.. ప్రస్తుతం ఆయన చేపట్టిన కార్యక్రమాని ఉటంకిస్తూ సెటైర్లు పేల్చారు. ‘అమ్మ నాటీ.. అసలు మ్యాటర్ ఇదా?’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీలో కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. కరోనాకు మందు కనిపెట్టిన విషయం తెలిసిందే. ఈ మందుపై పెను దుమారమే రేగింది. ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన జగపతి బాబు.. ఆనందయ్యకు మద్ధతు ప్రకటించారు. ఆయన మందు మంచిదంటూ ప్రశంసించారు. అంతేకాదు.. తాను కూడా ఆ మందును వాడినట్లు ప్రకటించారు.

ఈ వ్యాఖ్యలపై తాజాగా బాబు గోగినేని స్పందించారు. జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారంటూ, జూబ్లిహిల్స్‌లో ఆస్పత్రి తెరవబోతున్నారంటూ ఓ లోకల్‌ ఇంగ్లీష్‌ వెబ్ సైట్‌లో వార్త వచ్చింది. ఆ వార్తను ఆధారంగా చేసుకున్న బాబు గోగినేని.. ఫేస్‌బుక్ వేదికగా ఇలా జగపతిబాబుపై సెటైర్లు వేశారు. ‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ ఎద్దేవా చేశారు.

Babu Gogineni Facebook Post:

Also read:

SBI ATM Card: మీ ఎస్‌బిఐ ఏటీఎం కార్డ్ పోయిందా?.. అయితే ఇలా బ్లాక్ చేయండి.. సేఫ్‌గా ఉండండి..

Bigg Boss 14: ‘బిగ్ బాస్ 14’ ఫేమ్ సోనాలి ఫోగాట్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు.. ఆ వీడియోనే కారణం..!