SBI ATM Card: మీ ఎస్‌బిఐ ఏటీఎం కార్డ్ పోయిందా?.. అయితే ఇలా బ్లాక్ చేయండి.. సేఫ్‌గా ఉండండి..

SBI ATM Card: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కస్టమరా? మీ ఎస్‌బిఐ ఎటిఎం కమ్ డెబిట్ కార్డును పోగొట్టుకున్నారా? మరేం పర్వాలేదు.

SBI ATM Card: మీ ఎస్‌బిఐ ఏటీఎం కార్డ్ పోయిందా?.. అయితే ఇలా బ్లాక్ చేయండి.. సేఫ్‌గా ఉండండి..
Sbi Atm
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 13, 2021 | 7:49 AM

SBI ATM Card: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కస్టమరా? మీ ఎస్‌బిఐ ఎటిఎం కమ్ డెబిట్ కార్డును పోగొట్టుకున్నారా? మరేం పర్వాలేదు. టెన్షన్ పడాల్సిన పని అసలే లేదు. మీ ఏటీఎం కార్డును ఇతరులు దుర్వినియోగం చేయకుండా ఆన్‌లైన్ ద్వారా మీ డెబిట్, ఏటీఎం కార్డును బ్లాక్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

‘‘మీ కార్డు పోయినా లేదా దొంగిలించబడినా మీరు ఇప్పుడు ఆన్‌లైన్ ఎస్బిఐ ద్వారా మీ ఎస్బిఐ ఎటిఎం కమ్ డెబిట్ కార్డును బ్లాక్ చేయవచ్చు.’’ అని ఎస్బిఐ తాజాగా ప్రకటించింది. అందుకు సంబంధించి విధి విధానాలను కూడా వెల్లడించింది. మరి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం.

మీ ఎటిఎం కమ్ డెబిట్ కార్డును బ్లాక్ చేయడానికి కింద పేర్కొన్నట్లుగా ఫాలో అవ్వండి..

1. వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌తో www.onlinesbi.com కు లాగిన్ అవ్వాలి. 2. ‘ఇ-సర్వీసెస్’ టాబ్ క్రింద ‘ఎటిఎం కార్డ్ సర్వీసెస్> బ్లాక్ ఎటిఎం కార్డ్’ లింక్‌ను ఎంచుకోండి. 3. మీ ఎటిఎం కమ్ డెబిట్ కార్డును బ్లాక్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి. 4. అన్ని యాక్టివ్, బ్లాక్ కార్డులు డిస్‌ప్లేపై కనిపిస్తాయి. కార్డు(ల) యొక్క మొదటి 4, చివరి 4 అంకెలు మీకు చూపబడతాయి. 5. మీరు ఏ కార్డును అయితే బ్లాక్ చేయాలనుకుంటున్నారో ఆ కార్డును ఎంచుకోవాలి. ఆ తరువాత సబ్మిట్‌ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత వివరాలు ధృ‌వీకరించి నిర్ధారించాల్సి ఉంటుంది. 6. ప్రామాణీకరణ మోడ్‌ను SMS OTP లేదా ప్రొఫైల్ పాస్‌వర్డ్‌గా ఎంచుకోండి. 7. తదుపరి స్క్రీన్‌లో, ముందుగా ఎంచుకున్నట్లుగా OTP పాస్‌వర్డ్ / ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, ‘కన్‌ఫర్మ్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 8. మీ ఎటిఎం కమ్ డెబిట్ కార్డును విజయవంతంగా బ్లాక్ చేసిన తరువాత రిజిస్టర్ నెంబర్‌తో కూడిన మెసేజ్ డిస్‌ప్లే పై చూపుతారు. భవిష్యత్ అవసరాల కోసం ఆ రిజిస్టర్ నెంబర్‌ను భద్రపరుచుకోండి.

Also read:

Bigg Boss 14: ‘బిగ్ బాస్ 14’ ఫేమ్ సోనాలి ఫోగాట్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు.. ఆ వీడియోనే కారణం..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?