AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాళ్లకు రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ చేయించుకున్న ఆస్ట్రేలియా పొడగుకాళ్ల సుందరి.. ఎందుకంటే?

Australia Beauty Sarah Marschke: ఆస్ట్రేలియాకు చెందిన మిస్ వరల్డ్ సారా తన కాళ్లకు రూ.7 కోట్ల ఇన్యూరెన్స్ చేయించుకుంది. ఆస్ట్రేలియాలోని బుండా‌బర్గ్‌లో జన్మించిన 22 ఏళ్ల సారా.. 2019లో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా కిరీటాన్ని గెలుచుకుంది.

కాళ్లకు రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ చేయించుకున్న ఆస్ట్రేలియా పొడగుకాళ్ల సుందరి.. ఎందుకంటే?
Miss World Australia Sarah Marschke
Janardhan Veluru
|

Updated on: Jun 12, 2021 | 5:31 PM

Share

Australia Beauty Sarah Marschke: మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా సారా తన కాళ్లకు రూ.7 కోట్ల ఇన్యూరెన్స్ చేయించుకుంది. ఆస్ట్రేలియాలోని బుండా‌బర్గ్‌లో జన్మించిన 22 ఏళ్ల సారా.. 2019లో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా కిరీటాన్ని గెలుచుకుంది. అందాల పోటీల్లో తనకు లభించిన గుర్తింపునకు తన పొడవాటి అందమైన కాళ్లే కారణమని 22 ఏళ్ల బ్యూటీ చెబుతోంది. అందుకే తన శరీరంలోని అందమైన కాళ్లను ఇన్సూరెన్స్ చేయించానని తెలిపింది. సారా ఫ్యామిలీలో చాలా మంది రగ్బీ ఆటగాళ్లు ఉన్నారు. సారా మాత్రం ఫుట్‌బాల్ వైపు అడుగులు వేస్తోంది. త్వరలో ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ ఉమెన్స్ లీగ్‌లో సారా మార్ష్కే ఆడబోతోంది. ఆస్ట్రేలియా మీడియా సంస్థలు సారా‌కు సంబంధించి రోజూ ఏదో ఒక న్యూస్‌ను రాసేందుకు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించడం ఆస్ట్రేలియా మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తన చిన్నతనంలో నీ కాళ్లేంటి అంత పొడవుగా, సన్నగా ఉన్నాయని ఏడిపించేవాళ్లని గుర్తుచేసుకుంది. అయితే తన కాళ్లే తనకు అందాన్ని ఇస్తాయని అప్పుడు అనుకోలేదని చెప్పింది. గతంలో హేళను చేసినవాళ్లే ఇప్పుడు తన కాళ్లను ఇప్పుడు ప్రేమిస్తున్నారని తెలిపింది. తన పొడవైన కాళ్ల వల్లే తాను ఫుట్‌బాల్ లో రాణించగలుగుతున్నట్లు చెప్పింది. తన ఆటతో ప్రేమలో పడ్డానని…అందుకే అందుకే తన కాళ్లకు మిలియన్ డాలర్ల(రూ.7 కోట్ల) ఇన్సూరెన్స్ చేయించానని చెప్పుకొచ్చింది పొడుగుకాళ్ల సుందరి సారా.

ఆస్ట్రేలియా బ్యూటీ తన కాళ్లకు 1 మిల్లియన్ డాలర్లకు ఇన్సూరెన్స్ చేయించుకోవడం ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

Also Read..‘క‌రోనా మాతా.. కాపాడ‌మ్మా, శాంతించ‌మ్మా’.. మ‌హమ్మారికి గుడిక‌ట్టి పూజ‌లు చేస్తున్న గ్రామ‌స్తులు

పెళ్లి బాజాల శబ్దాలతో చిర్రెత్తుకొచ్చిన గజరాజు ఏం చేసిందంటే …? యూపీలో పరుగో పరుగు !