గబ్బిలాలను వదలని చైనా శాస్త్రజ్ఞులు…….24 కొత్త కరోనా వైరస్ లను కనుగొన్నామని వెల్లడి.. ‘వూహాన్ థియరీకి’ చెక్ పెట్టేందుకేనా ..?
కోవిద్-19 వైరస్ కి సంబంధించి చైనా శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలను ఇంకా కొనసాగిస్తున్నారు. వివిధ జాతుల గబ్బిలాల నుంచి 24 రకాల కరోనా వైరస్ లను కనుగొన్నట్టు శాండాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
కోవిద్-19 వైరస్ కి సంబంధించి చైనా శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలను ఇంకా కొనసాగిస్తున్నారు. వివిధ జాతుల గబ్బిలాల నుంచి 24 రకాల కరోనా వైరస్ లను కనుగొన్నట్టు శాండాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. వీటిలో 4 సార్స్-కొవ్ 2 వైరస్ లు కూడా ఉన్నాయన్నారు. తమ అధ్యయనం గురించిన విశేషాలను వారు ఓ మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. కోవిద్-19 వైరస్ పుట్టుకపై సమగ్ర ఇన్వెస్టిగేషన్ జరగాలని ప్రపంచ ద\దేశాలు కోరుతుండగా వీరు మళ్ళీ గబ్బిలాలను ‘తెరపైకి’ తెచ్చారు. వాయువ్య చైనాలోని అడవుల్లో గల వివిధ జాతుల గబ్బిలాల నుంచి తాము వాటి యూరిన్, వ్యర్థాలను, చివరకు వాటి నోటి నుంచి స్వాబ్ (ఉమ్మి తుంపర్లను) శాంపిల్స్ ను కూడా ల్యాబ్ లో పరిశోధించినట్టు పేర్కొన్నారు. 2019 మే-2020 నవంబరు మధ్య కాలంలో ఇలా గబ్బిలాలపై రీసెర్చ్ చేశామని,, వీటినుంచి బయటపడిన వైరస్ లలో మొత్తం 24 రకాల జీనోమ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. వీటి ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాపిస్తోందన్నారు. ముఖ్యంగా సార్స్-కొవ్ 2 వైరస్ ప్రస్తుత కోవిద్ మహమ్మారికి దారి తీసిందని వారు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఈ వైరస్ లోని నాబ్ వంటి స్ట్రక్చర్ ని కణజాలానికి ఎటాచ్ చేస్తుంది. దీంతో అది శక్తిని పుంజుకొంటుంది అని ఓ రీసెర్చర్ వెల్లడించారు. 2020 జూన్ నెలలో థాయిలాండ్ నుంచి కూడా కొన్ని గబ్బిలాల వైరస్ శాంపిల్స్ ను పరీక్షించామని, ఇదే సార్స్-కొవ్ 2 కూడా వాటిలోనూ కనిపించిందని తెలిపారు.
కాగా చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ పుట్టి ఉండవచ్చునన్న వ్యాఖ్యలను, అనుమానాలను మాత్రం వారు కొట్టిపారేస్తున్నారు. తమ రీసెర్చ్ ఇంకా గబ్బిలాలపై కొనసాగుతోందన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Indian Military Academy: పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసి భారత సైన్యంలో భాగం అయిన 425 జెంటిల్మెన్ క్యాడెట్ల