AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా గూఢచారికి హైదరాబాద్‌లోనూ కంపెనీ?.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

ఇండియాలో పలు ఆర్ధిక నేరాలకు పాల్పడిన చైనీయుడు హాన్ జున్ వే చివరకు పట్టుబడ్డాడు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నిస్తున్న ఇతడిని బీ ఎస్ ఎఫ్ గస్తీదళం బెంగాల్ లోని మాల్దా జిల్లాలో శుక్రవారం పట్టుకుంది.

చైనా గూఢచారికి హైదరాబాద్‌లోనూ కంపెనీ?.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Chinese National Smuggled 1300 Indian Sims To China
Umakanth Rao
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 12, 2021 | 8:28 PM

Share

ఇండియాలో పలు ఆర్ధిక నేరాలకు పాల్పడిన చైనీయుడు హాన్ జున్ వే రెండ్రోజుల క్రితం పట్టుబడటం తెలిసిందే. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నిస్తున్న జున్వేను బీఎస్ఎఫ్ గస్తీదళం బెంగాల్ లోని మాల్దా జిల్లాలో శుక్రవారం వేకువజామున పట్టుకుంది. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన్ను స్థానిక పోలీసులకు అప్పగించారు. 1300 భారతీయ సిమ్ కార్డులను చైనాకు చేరవేసేందుకు ఇతడు ఇండియన్ డాక్యుమెంట్స్ ను ఫోర్జరీ చేశాడని, వీటిని ఇతని సహచరులు తమ లో దుస్తుల్లో దాచి తమ దేశానికి స్మగుల్ చేశారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. భారతీయుల బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయడానికి ఈ సిమ్ కార్డులను వాడేవాడని..36 ఏళ్ళ హాన్ జున్ వే చైనాలోని హుబె సిటీకి చెందినవాడని నిర్ధారించారు.

గురు గ్రామ్ లో హాన్ జున్ వేకి ఓ హోటల్ ఉందని దర్యాప్తులో తేలింది.  దాన్ని తన అక్రమ కార్యకలాపాలకు వినియోగించుకునే వాడుకున్నట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అతని బిజినెస్ పార్ట్ నర్ అయిన సున్ జియాంగ్ ను కూడా కొన్ని రోజుల క్రితమే యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ పట్టుకుంది. జున్ భార్య కూడా అతని అక్రమాల్లో సహకరిస్తూ వచ్చిందని అధికారులు వెల్లడించారు. వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఆమె పేరు కూడా ఉందన్నారు. జున్ వే కోసం లోగడ బ్లూ కార్నర్ నోటీసును అధికారులు జారీ చేశారు. చైనా ఇంటెలిజెన్స్ కోసం ఇతగాడు పని చేస్తూ వచ్చాడని ఇంటరాగేషన్ లో తెలిసిందని పోలీసులు చెప్పారు. గురు గ్రామ్ లో దర్జాగా హోటల్ నడిపాడంటే నమ్మశక్యంగా లేదని.కానీ .అక్కడి సిబ్బందిని కూడా విచారిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. హాన్ జున్ వే నుంచి పలు ఎలెక్ట్రానిక్ వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌తోనూ జున్వీకి లింకు?

చైనా గూఢచారి జున్వీ హాన్ కి 2010 లో హైదరాబాద్ మరియు 2019 తరువాత ఢీల్లీ , గురుగావ్ తో రాకపోకలున్నట్లు తెలుస్తోంది. జున్వీ హాన్ హైదరాబాద్ బేస్డ్ కంపినీలో 2017 నుంచి డైరక్టర్ గా వున్నాడు. పహాడీ షరీఫ్, హైదరాబాద్ అడ్రస్ తో రిజిస్టరైన హువా టోంగ్ బెహ్తార్ విశ్వ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపినీలో జున్వీ హాన్ తో పాటు నాలుగు హైదరాబాదీలు పార్ట్నర్స్ గా వున్నారు. వారికి సంబదించిన వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. జున్వీ హాన్ తో ఆ బ్దుల్ రజాక్ అబ్దుల్ నబి మెమొన్, ప్రశాంత్ కుమార్ పోలిశెట్టి, ముస్తాక్ మహమ్మదీన్ షాలు ఈ కంపినీలో పార్ట్నర్స్ గా ఉన్నారు. విదేశాల నుంచి ఈ కంపినీకి అక్రమంగా నిధులు వస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి..

Megha Rajagopalan: భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం.. చైనా బండారం బయటపెట్టినందుకు..

Drone Bus: ట్రైన్ టికెట్ ఖర్చు..హెలికాప్టర్ ప్రయాణం..అదే డ్రోన్ బస్సు..రెడీ అవుతోంది!