AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G7 Family Photo: ‘ఫ్యామిలీ ఫోటో.’……జీ-7 దేశాల అధినేతలకు మాస్కులేవీ …? ఇంటర్నెట్ లో మీమ్ ల ‘వెల్లువ ‘ !

మొదటిసారిగా జీ-7 దేశాల అధినేతలు ఓ 'ఫ్యామిలీ ఫోటో' దిగారు.. బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, జపాన్, ఇటలీ దేశాధినేతలంతా ఇంగ్లాండ్ నుంచి కార్బీస్ బే కి చేరుకొని సరదాగా అక్కడ ఇలా పోజిచ్చారు.

G7 Family Photo: 'ఫ్యామిలీ ఫోటో.'......జీ-7 దేశాల అధినేతలకు మాస్కులేవీ ...?  ఇంటర్నెట్ లో మీమ్ ల 'వెల్లువ ' !
G7 Family Photo
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 12, 2021 | 8:40 PM

Share

మొదటిసారిగా జీ-7 దేశాల అధినేతలు ఓ ‘ఫ్యామిలీ ఫోటో’ దిగారు.. బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, జపాన్, ఇటలీ దేశాధినేతలంతా ఇంగ్లాండ్ నుంచి కార్బీస్ బే కి చేరుకొని సరదాగా అక్కడ ఇలా పోజిచ్చారు. వీరంతా తమ భార్యలతో సహా ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం విశేషం. అయితే ప్రధాని మోదీ మాత్రం వర్చ్యువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ దేశాధినేతలంతా కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్నారు గనుక ఎవరూ మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించారు గానీ.. కొంతమంది అటెన్షన్ పోజులో నిలబడడం విడ్డూరంగా ఉందని కొందరు నెటిజనులు వ్యాఖ్యానించారు. ఈ ఫోటో చూసి ఒక యూజర్..’ది రీబూట్ ఆఫ్ ఎవెంజర్స్ లుక్ వైల్డ్ ‘ ( నాకిది చూస్తుంటే ఎవెంజర్స్ మూవీ చూసినట్టు ఉంది) అని ఆంటే..మరొకరు మార్వెల్ హౌస్ ప్రొడక్షన్ వారి ‘ఎటర్నల్’ సినిమాను ఇది తలపిస్తోందన్నారు. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఐ సీ గేమ్ పీసెస్ అని మరొకరు పేర్కొంటే మరి కొందరు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జుట్టు గురించి గమ్మత్తుగా తమ అభిప్రాయాన్ని తెలిపారు.

ఇక జీ-7 సమ్మిట్ లో ముఖ్యంగా కోవిద్ అదుపు, గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాలను ఈ దేశాధినేతలు ప్రస్తావించారు. టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో ఉమ్మడిగా సహకరించుకోవాలని, పిలుపునిచ్చారు. కాగా పేద, మధ్యాదాయ దేశాలకు వంద కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలని అధినేతలంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. 2022 కల్లా ‘ వ్యాక్సినేట్ ది వరల్డ్ అన్న నినాదాన్ని వీరు ప్రస్తావించారు. కోవిద్ మహమ్మారి నుంచి కోట్లాది ప్రజలను రక్షించవలసి ఉందని, ఇందులో భాగంగా తాము 500 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఆయా దేశాలకు పంపుతామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చెప్పారు.

మరిన్ని  ఇక్కడ చూడండి: ప్రశాంత్ కిషోర్ ని మా ఎన్నికల వ్యూహకర్తగా నియమించబోం……ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ క్లారిటీ

Niharika Konidela: అమ్మ చీర‌లే అందం.. న‌యా రూటులో బుట్టబొమ్మ‌లు.. ఎంత ముద్దుగా ఉన్నారో సుమీ..!