Niharika Konidela: అమ్మ చీర‌లే అందం.. న‌యా రూటులో బుట్టబొమ్మ‌లు.. ఎంత ముద్దుగా ఉన్నారో సుమీ..!

ఈ మధ్య హీరోయిన్ల పెళ్లిళ్లు సడన్‌ సర్‌ప్రైజ్‌లుగా మారిపోయాయి. అయితే పెళ్లికి ముందు పెద్దగా సందడి లేకపోయినా.. పెళ్లి తరువాత మాత్రం చాలా రోజులు....

Niharika Konidela:  అమ్మ చీర‌లే అందం.. న‌యా రూటులో బుట్టబొమ్మ‌లు.. ఎంత ముద్దుగా ఉన్నారో సుమీ..!
Actress In Mother Saree
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 12, 2021 | 8:36 PM

ఈ మధ్య హీరోయిన్ల పెళ్లిళ్లు సడన్‌ సర్‌ప్రైజ్‌లుగా మారిపోయాయి. అయితే పెళ్లికి ముందు పెద్దగా సందడి లేకపోయినా.. పెళ్లి తరువాత మాత్రం చాలా రోజులు మాట్లాడుకునేలా చేస్తున్నారు ఈ బ్యూటీస్‌. లేటెస్ట్ సెన్సేషన్ యామీ గౌతమ్ పెళ్లి కూడా ఇప్పుడు న్యూస్‌ లో హల్ చల్‌ చేస్తోంది. ముఖ్యంగా పెళ్లిలో యామీ డ్రెస్సింగ్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. పెళ్లి కోసం ఏ ఇంటర్‌నేషనల్ డిజైనర్‌ను సంప్రదించలేదట యామీ.. 33 ఏళ్ల క్రితం తన తల్లి కట్టుకున్న అదే పెళ్లిచీరను తన పెళ్లిలోనూ కట్టుకున్నారట ఈ బ్యూటీ. అంతేకాదు.. తన ఈ అకేషన్‌కి యామీ వేసుకున్న జ్యువెలరీ కూడా తల్లిదేనట. యునిక్ డిజైనర్‌ డ్రెస్‌.. కాస్ట్‌లీ జ్యువెలరీ కన్నా… అమ్మ చీరే నాకు గొప్పగా అనిపించింది అంటున్నారు ఈ మోడ్రన్ బ్యూటీ.

నార్త్ భామలే కాదు సౌత్ హీరోయిన్లు కూడా అమ్మ మీద ప్రేమను ఇలాగే చూపిస్తున్నారు. మెగా డాటర్‌ నీహారిక తన పెళ్లికి అమ్మ చీరనే కట్టుకున్నారు. అయితే యాజిటీజ్‌గా కాకుండా…. ఆ చీర మీద కాస్త గ్రాండ్ వర్క్ చేయించుకొని ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా రెడీ చేయించుకున్నారు నీహారిక. కపూర్ ఫ్యామిలీ గర్ల్స్ కూడా తమ పెళ్లి వేడుకల కోసం ఇలాంటి చాయిసే తీసుకున్నారు. సోనమ్‌ కపూర్‌ అమ్మ చీరతోనే పెళ్లికూతరయ్యారు. నవాబ్‌ ఇంటి కోడలిగా మారి కరీనా మాత్రం పెళ్లి వేడుకలో అత్తగారి చీర కట్టుకున్నారు. టాప్ సెలబ్రిటీలు ఇలా పాత సాంప్రదాయాలు ఎంచుకోవటంతో ఫ్యాన్స్‌ కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

Also Read: నెగిటివిటీనే స‌మంత‌కు సూపర్ పాజిటివిటీగా మారింది.. ఇప్పుడు ఆమె టార్గెట్ ఇదే

 ‘ఆహా’లో విడుద‌లైన అర్ధశతాబ్దం.. ఎలా ఉందంటే..?