Kambalapally kathalu : చాప్టర్ 2 కు సిద్దమవుతున్న కంబాలపల్లి కథలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు..
పల్లెల్లో మట్టివాసన ఎప్పుడైనా.. తాజాగా ఉంటుంది. అది మన మనస్సుకు ఆహ్లాదాన్నిస్తుంది. అలాగే అక్కడ పుట్టే కథలు కూడా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి.
పల్లెల్లో మట్టివాసన ఎప్పుడైనా.. తాజాగా ఉంటుంది. అది మన మనస్సుకు ఆహ్లాదాన్నిస్తుంది. అలాగే అక్కడ పుట్టే కథలు కూడా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. 20 ఏళ్ల క్రితం తెలంగాణ పల్లెలో జరిగిన కథ అంటూ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అయిన మెయిల్ మూవీని కూడా ఎవరూ మర్చిపోలేరు సరికదా.. చాప్టర్ 2 ఎప్పుడంటూ ఆతురతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడంటే కాలం మారింది కానీ.. ఒకప్పుడు.. అదీ పల్లెల్లో అన్నీ అమాయకపు ముఖాలే. ఎక్కడా ఎలాంటి ఎమోషన్ బయటకు కనిపించని రోజులే. కంప్యూటర్ పరిచయం అవుతున్న రోజుల్లో అంటే 2000 వ సంవత్సరంలో.. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథ అంటూ వచ్చిన మెయిల్.. అమాయకత్వపు హాస్యాన్ని అద్భుతంగా పండించి.. సక్సెస్ అయ్యింది. ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా పేరు గుర్తొచ్చినా.. ఇంట్లో కంప్యూటర్ చూసినా.. ఇప్పటికీ ఈ సినిమాలోని క్యారెక్టర్లు గుర్తుకు వస్తూ మన ముఖాల్లో నవ్వు కనిపిస్తుంటుంది. అంతలా ఈ సినిమా.. ఈ సినిమలోని క్యారెక్టర్లు మనల్ని ఆకట్టుకున్నాయి.
అయితే ఈ ఏడాది మొదట్లో విడుదలైన మెయిల్ చిత్రానికి కొనసాగింపుగా… చాప్టర్ 2 ఎప్పుడు వస్తుందంటూ నెటిజన్లు డైరెక్టర్ ఉదయ్ గుర్రాలను ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా చివర్లో సీక్వెల్ ఉండనుందనే హింట్ డైరెక్టర్ ఇవ్వడంతో.. కంబాలపల్లి అభిమానులు సోషల్ మీడియా వేదికగా మేకర్స్‌ను డిమాండ్ చేస్తున్నారు. చాప్టర్ 2 ను త్వరగా తీసుకొచ్చే ప్రయత్నిం చేయాలని వారు సోషల్ మీడియా వేదికలపై మీమ్స్ ను క్రియేట్ చేసి వదులుతున్నారు. మేకర్స్‌లో ఎవరో ఒకరు ఈ మీమ్స్ చూడలేక పోతారా.. చాప్టర్ 2 పై అప్డేట్ ఇవ్వకపోతారా అంటూ.. ఆశపడుతున్నారు. మరి వీరి డిమాండ్‌పై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి!
మరిన్ని ఇక్కడ చదవండి :