AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : ఐకాన్ స్టార్ కోసం ఎదురుచూస్తున్న టాప్ 5 డైరెక్టర్స్.. వరుస సినిమాలతో బిజీ బిజీగా బన్నీ..

స్టైలిష్ స్టార్‌ టూ ఐకానిక్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ నెంబర్‌ వన్‌ హీరోగా మారిపోడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ.. మోస్ట్ బిజీఎస్ట్ స్టార్‌గా అందరిచేత పిలిపించుకుంటున్నారు కూడా...

Allu Arjun : ఐకాన్ స్టార్ కోసం ఎదురుచూస్తున్న టాప్ 5 డైరెక్టర్స్.. వరుస సినిమాలతో బిజీ బిజీగా బన్నీ..
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Jun 12, 2021 | 5:58 PM

Share

Allu Arjun:

స్టైలిష్ స్టార్‌ టూ ఐకానిక్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ నెంబర్‌ వన్‌ హీరోగా మారిపోడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ.. మోస్ట్ బిజీఎస్ట్ స్టార్‌గా అందరిచేత పిలిపించుకుంటున్నారు కూడా. పాన్‌ ఇండియా సినిమాల దగ్గర నుంచి పక్క ఇండస్ట్రీల డైరెక్టర్ల వరకు అన్నింటికి, అందరికీ ఫస్ట్ చాయిస్గా మారి అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియ మూవీ “పుష్ఫ” సినిమాలో నటిస్తున్న బన్నీ.. ఆ తరవాత వరుసగా డైరెక్టర్లను లైన్లో పెట్టి మరో 2 సంవత్సరాలు డేట్లు ఖాళీలేనంతగా బిజీగా మారిపోయారు. ప్రస్తుతం “పుష్ప” రెండు భాగాల్లో నటిస్తున్న బన్నీ… ఆ సినిమా షూటింగ్ ముగియగానే.. కొరటాల శివ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నారు. కొరటాల స్టైల్లో సామిజిక ఎలిమెంట్‌ తో తెరకెక్కనున్న ఈ సినిమా.. ఎన్టీఆర్‌ కొరటాల ప్రాజెక్ట్‌ కంప్లీట్‌ అవగానే మొదలు కానుందట.ఇక కొరటాల తరువాత వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్‌ డైరెక్షన్ “ఐకాన్‌” సినిమా చేబోతున్నారు బన్నీ. దిల్ ప్రొడక్షన్‌లో రూపొందనున్న ఈ సినిమాను మేకర్స్‌ ఎప్పుడో గ్రాండ్గా అనౌన్స్ కూడా చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే రీసెంట్‌గా ఈ సినిమా పై మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. తొందర్లో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుందంటూ ఓ ప్రకటన కూడా చేశారు.

తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. అయితే గజినీ సినిమాకు సీక్వెల్లో నటిస్తారా..? లేక ఫ్రెష్ సబ్జెక్ట్‌తో మన ముందుకు వస్తారా అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మాస్‌ డైరెక్టర్ బోయపాటి చెప్పిన స్టోరీ లైన్‌కు కూడా బన్నీ రీసెంట్గా ఓకే చెప్పారట. సరైనోడు సినిమా తరువాత మళ్లీ బన్నీతో సినిమా తీయాలనుకున్న బోయపాటి.. బన్నీకి సరిపోయే సబ్జెక్ట్తో రీసెంట్గా తలుపు తట్టారు. సబ్జెట్ బాగా నచ్చడంతో డైరెక్టర్‌ను లాక్‌ చేశారట బన్నీ. అన్నీ అనుకున్న్టటు జరిగితే ఈ సినిమా కూడా తొందర్లో మొదలు కానుందని ఇండస్రీలో టాక్‌ వినిపిస్తోంది.ఇక మరో యంగ్ అండ్‌ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌ కూడా బన్నీతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చాలా వేదికలపై విక్రమ్ డైరెక్షన్లో నటించాలనుందంటూ చెప్పిన బన్నీ.. ఆయన చెప్పిన ఓ యునిక్‌ సబ్జెట్కు ఫిదా అయిపోయి.. సినిమాకు ఓకే చెప్పారని ఇండస్ట్రీలో టాక్‌. ఇలా వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ.. టాలీవుడ్ మోస్ట్ బిజీఎస్ట్ హీరోగా మారిపోయారు బన్నీ. అంతేకాదు ఈ సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కనున్నాయి. ఈ రకంగా చూస్తే బన్నీ అతిత్వరలో టాలీవుడ్‌ నెంబర్‌ వన్‌ హీరోగా మారడం ఖాయం అంటే ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు వాపోతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vishnu Priya: తన డాన్స్ వీడియోల తో కుర్రాళ్లను టార్గెట్ చేసిన యాంకర్ విష్ణుప్రియ… ( వీడియో )

Tuck Jagadish : రిలీజ్ కు ముందే నాని సినిమా హిట్ అంటూ టాక్.. సోషల్ మీడియాలో వైరల్..

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు