PSPK28: పవర్ స్టార్ సినిమాలో మలయాళ కుట్టీ.. పవన్- హరీష్ శంకర్ ప్రాజెక్ట్ లో ఆ హీరోయిన్

పవన్‌ సినిమాలో మలయాళ కుట్టీ అంటూ తన పేరు నెట్టింట వైరల్ అవుతండడంతో.. అలాంటిదేం లేదంటూ.. చెప్పారు ఆ హీరోయిన్.

PSPK28: పవర్ స్టార్  సినిమాలో మలయాళ కుట్టీ.. పవన్- హరీష్ శంకర్ ప్రాజెక్ట్ లో ఆ హీరోయిన్
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 12, 2021 | 9:09 PM

PSPK28:

పవన్‌ సినిమాలో మలయాళ కుట్టీ అంటూ తన పేరు నెట్టింట వైరల్ అవుతండడంతో.. అలాంటిదేం లేదంటూ.. చెప్పారు ఆ హీరోయిన్. పవన్‌ సినిమాలో నాక్కూడా నటించాలని ఉన్నా కూడా.. నాకేం ఆయన సినిమాలో ఆఫర్ రాలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరు? ఏంటా సినిమా? మీకు కూడా తెలుసుకోవాలనుంది కదూ..! పవన్‌ హీరోగా హరీష్ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం pspk28. అయితే ఈ సినిమాలో పవన్‌ సరసన మలయాళ కుట్టీ మానస రాధాకృష్ణన్‌ నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల హల్‌ చల్ చేశాయి. అయితే తాజాగా వీటిపై స్పందించారు మానస రాధాకృష్ణన్. “పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని.. కానీ ఆయన సినిమాలో తాను నటించడంలేదని” సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫ్యాన్‌ మేడ్‌ ఫస్ట్‌ లుక్‌లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. “సంచారి” ” స్టేట్‌కి ఒక్కడనే” అనే పేర్లతో ఆ లుక్‌లు టాక్‌ ఆఫ్‌ది స్టేట్‌ గా మారాయి కూడా. దీంతో ఈ మూవీ మేకర్స్‌ అఫీషల్ ఫస్ట్‌లుక్‌లు ఇవి కాదంటూ.. తామే తొందర్లో పవన్‌ లుక్‌ను రిలీజ్‌ చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ఓ క్లారిటీ కూడా ఇవ్వాల్సి వచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kambalapally kathalu : చాప్టర్ 2 కు సిద్దమవుతున్న కంబాలపల్లి కథలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు..

Niharika Konidela: అమ్మ చీర‌లే అందం.. న‌యా రూటులో బుట్టబొమ్మ‌లు.. ఎంత ముద్దుగా ఉన్నారో సుమీ..!

Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న ఐకాన్ స్టార్.. హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్ చేస్తున్న బన్నీ..