Ram Charan: తమిళ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్ కు పండగే..

ట్రిపులార్‌ కారణంగా లాంగ్ గ్యాప్ రావటంతో నెక్ట్స్ మూవీ విషయంలో గ్యాప్‌ లేకుండా జాగ్రత్త పడుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌.

Ram Charan: తమిళ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్  చేస్తున్న మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్ కు పండగే..
Ram Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 12, 2021 | 9:22 PM

Ram Charan: ట్రిపులార్‌ కారణంగా లాంగ్ గ్యాప్ రావటంతో నెక్ట్స్ మూవీ విషయంలో గ్యాప్‌ లేకుండా జాగ్రత్త పడుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌. ఇప్పటికే శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ అయ్యింది. కానీ లైకా ప్రొడక్షన్స్‌, శంకర్ మధ్య వివాదం జరుగుతుండటంతో ఆ మూవీ డిలే అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే గ్యాప్ రాకుండా మధ్యలో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారట రామ్ చరణ్. ట్రిపులార్ తరువాత చేసే సినిమా కావటంతో ఈ మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఈ మెగా హీరో. అందుకే తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కన పెట్టి ఓ డిఫరెంట్ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఫీల్‌ గుడ్‌ చిత్రాల దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరితో రామ్‌ చరణ్‌ ఓ సినిమా చేస్తున్నారన్న టాక్ చాలా రోజులుగా ఉంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో దర్శకుడు ఎంటర్‌ అయ్యారు. ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట చెర్రీ. శంకర్ సినిమా ఆలస్యమైతే ఈ రెండింట్లో ఏదో ఒకటి లైన్‌లో పెట్టే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న ఐకాన్ స్టార్.. హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్ చేస్తున్న బన్నీ..

Katrina Kaif: క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత శ‌రీరానికి కాస్త స‌మ‌యం ఇవ్వాలి.. స్వీయ అనుభ‌వాన్ని వివ‌రించిన క‌త్రీనా..

Anitha: తూచ్.. నేను అలా అన‌లేదు. త‌న యాక్టింగ్ కెరీర్‌కు సంబంధించి వ‌స్తోన్న వార్త‌ల‌ను ఖండించిన న‌టి అనిత‌..

Rashi Khanna : ప్రభాస్ భారీ సినిమాలో ఈ బాబ్లీ బ్యూటీ దాదాపు ఖరారైందట.. ఖుషీలో రాశి ఫ్యాన్స్..