AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anitha: తూచ్.. నేను అలా అన‌లేదు. త‌న యాక్టింగ్ కెరీర్‌కు సంబంధించి వ‌స్తోన్న వార్త‌ల‌ను ఖండించిన న‌టి అనిత‌..

Anitha: కొన్నిసార్లు మ‌నం ఒక‌లా చెబితే ఎదుటి వారికి మ‌రోలా అర్థ‌మ‌వుతుంది. మరీ ముఖ్యంగా సెల‌బ్రిటీల విష‌యంలో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. వారు ఒకలా చెబితే అది జ‌నాల్లోకి ఇంకోలా వెళుతుంది. నిజానికి చెప్పే వారు చెప్ప‌డంలో క్లారిటీ...

Anitha: తూచ్.. నేను అలా అన‌లేదు. త‌న యాక్టింగ్ కెరీర్‌కు సంబంధించి వ‌స్తోన్న వార్త‌ల‌ను ఖండించిన న‌టి అనిత‌..
Anitha About Her Acting Career
Narender Vaitla
|

Updated on: Jun 12, 2021 | 7:18 PM

Share

Anitha: కొన్నిసార్లు మ‌నం ఒక‌లా చెబితే ఎదుటి వారికి మ‌రోలా అర్థ‌మ‌వుతుంది. మరీ ముఖ్యంగా సెల‌బ్రిటీల విష‌యంలో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. వారు ఒకలా చెబితే అది జ‌నాల్లోకి ఇంకోలా వెళుతుంది. నిజానికి చెప్పే వారు చెప్ప‌డంలో క్లారిటీ లేక‌పోయినా.. దానిని అర్థం చేసుకునే వారిలో క్లారిటీ లేక‌పోయినా ఇబ్బందులు త‌లెత్తుతుంటాయి. తాజాగా న‌టి అనిత విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. నువ్వునేను సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్న న‌టి అనిత‌.. అనంత‌రం ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. ఇక వివాహం త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న అనిత‌.. సీరియ‌ళ్ల‌లో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అనిత‌.. త‌న‌కు న‌ట‌న కంటే త‌న చిన్నారి పోష‌ణ ముఖ్య‌మని చెప్పుకొచ్చింది. దీంతో అనిత సీరియ‌ళ్ల‌కు గుడ్ బై చెబుతోందని శ‌నివారం వార్త‌లు షికార్లు చేశాయి.

ఈ వార్త కాస్త అనిత చెవిలో ప‌డిందేమో దీనికి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. త‌న కెరీర్‌కు సంబంధించి వ‌స్తోన్న వార్త‌ల‌పై ట్విట్ట‌ర్‌ వేదికగా స్పందించిన అనిత‌.. `న‌ట‌న నుంచి పూర్తిగా త‌ప్ప‌కోనున్న‌ట్లు నేను ఎప్పుడూ చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం నా దృష్టంతా నా చిన్నారి పోష‌ణ‌పైనే ఉంద‌ని మాత్ర‌మే చెప్పాను.. నేను సంసిద్ధం కాగానే మ‌ళ్లీ న‌ట‌న‌ను తిరిగి ప్రారంభిస్తాను` అని ట్వీట్ చేసింది. ఇలా త‌న‌పై వ‌స్తోన్న వార్త‌ల‌కు ఒక్క ట్వీట్‌తో చెక్ పెట్టిందీ బ్యూటీ.

అనిత చేసిన ట్వీట్‌..

Also Read: Inter Students : ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేశారంటే జాబ్ గ్యారంటీ..! తక్కువ రోజులలో ఎక్కువ బెనిఫిట్..

Syska Smart Watch: సిస్కా నుంచి స్మార్ట్ వాచ్‌లు… శానిటైజ‌ర్ రిమాండ‌ర్ ప్ర‌త్యేక ఫీచ‌ర్‌.. 50 శాతం డిస్కౌంట్‌తో..

Rashi Khanna : ప్రభాస్ భారీ సినిమాలో ఈ బాబ్లీ బ్యూటీ దాదాపు ఖరారైందట.. ఖుషీలో రాశి ఫ్యాన్స్..