- Telugu News Photo Gallery Technology photos Syska launches new smart watch sw 100 features and price details
Syska Smart Watch: సిస్కా నుంచి స్మార్ట్ వాచ్‌లు… శానిటైజర్ రిమాండర్ ప్రత్యేక ఫీచర్.. 50 శాతం డిస్కౌంట్‌తో..
Syska Smart Watch: ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దీంతో బడా కంపెనీలు వీటి తయారీలోకి అడుగు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే సిస్కా కూడా తన తొలి స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది..
Updated on: Jun 12, 2021 | 6:42 PM

ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో చాలా కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ సిస్కా ఈ రంగంలోకి ప్రవేశించింది.

సిస్కా తన తొలి స్మార్ట్ వాచ్‌ను బోల్ట్ ఎస్‌డబ్ల్యూ100 పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ వాచ్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 10 రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.

కొవిడ్ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లో SpO2 పర్యవేక్షణ, చేతి శానిటైజేషన్ రిమైండర్, పల్స్‌రేటు, వెదర్ రిపోర్ట్‌ను అందిస్తోంది.

1.28 ఇంచుల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్‌ను బ్లూటూత్ వి5తో అన్ని రకాల ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చు.

సిస్కా ఈ స్మార్ట్ వాచ్‌ను రూ. 5,499గా నిర్ణయించింది. అయితే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సుమారు 54 శాతం భారీ తగ్గింపుతో రూ. 2,499కి అందిస్తోంది.




