samantha akkineni: నెగిటివిటీనే స‌మంత‌కు సూపర్ పాజిటివిటీగా మారింది.. ఇప్పుడు ఆమె టార్గెట్ ఇదే

సమంత బికమ్స్ ఓటీటీ క్వీన్... నార్త్ స్టార్ డమ్ ఫోకస్ ఆన్ సమంత... తెలుగులో సమంతకు వాట్ నెక్స్ట్...! ఇటువంటి వార్తలతో మోస్ట్ పాపులర్ అవుతున్నారు.....

samantha akkineni: నెగిటివిటీనే స‌మంత‌కు సూపర్ పాజిటివిటీగా మారింది.. ఇప్పుడు ఆమె టార్గెట్ ఇదే
Samantha Action Scene
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 12, 2021 | 6:11 PM

సమంత బికమ్స్ ఓటీటీ క్వీన్… నార్త్ స్టార్ డమ్ ఫోకస్ ఆన్ సమంత… తెలుగులో సమంతకు వాట్ నెక్స్ట్…! ఇటువంటి వార్తలతో మోస్ట్ పాపులర్ అవుతున్నారు అక్కినేని వారి కోడ‌లు. మరి.. తమిళ్ లో సమంత పరిస్థితి ఏంటి? ఆమెను ఎప్పటికి క్షమిస్తారు…? మళ్ళీ సొంత గడ్డపై సమంత సినిమాలు చేయగలరా? ఈ ప్రశ్నలు కూడా మరోవైపు నుంచి వినిపిస్తున్నాయి. నెగిటివిటీయే సూపర్ పాజిటివిటీగా మారుతోంది సమంతకు. ఫ్యామిలీమాన్2తో తమిళనాట ఎంత వ్యతిరేకత పుట్టినప్పటికీ… సదరు వెబ్ సిరీస్ వల్ల అంతకంటే ఎక్కువ పాపులారిటీ పెరుగుతోంది. సామ్ చేసిన రోల్ తో వచ్చిన హైప్.. ఏకంగా అమెజాన్ ప్రైమ్ ని కూడా అంతెత్తులో నిలబెట్టింది. ఈ ప్రెజర్ ని ఓవర్ కమ్ చేయ్యడానికి సమంతతో డీల్స్ ఓకే చేసుకుంటున్నాయి మిగతా ఓటీటీ కంపెనీలు.

తెలుగులో సమంత చేస్తున్న శాకుంతలం మూవీ మీద నాన్-తెలుగు మార్కెట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. అటు.. షాహిద్ కపూర్ లాంటి కొందరు హీరోలతో సమంత సినిమా చేస్తున్నట్టు రాసేస్తోంది నార్త్ మీడియా. కానీ.. సమంత ఆలోచన మాత్రం మరోచోట తిరుగుతోందా? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని సమంత టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నారా? ఎస్… తమిళ్ ఇండస్ట్రీ వైపు తీక్షణంగా చూస్తున్నారు సామ్. గతంలో కోలీవుడ్ కూడా సమంతకు ఈక్వల్ ప్లాట్ ఫామ్ ఇచ్చింది. మంచి సినిమాలతో ఎంకరేజ్ చేశారు తమిళ్ మేకర్స్. ఆ మాటకొస్తే.. తమిళ్ మూవీ సూపర్ డీలక్స్ లో సమంత పెర్ఫామెన్స్ చూశాకే ఫ్యామిలీమాన్2 ఛాన్స్ ఇచ్చారు రాజ్ అండ్ డీకే. మరి… ఆ ఫ్యామిలీమాన్ వల్లే తమిళ్ ఆడియెన్స్ కి తాను ఎందుకు దూరం కావాలి..? అనేది సామ్ ఆలోచనట.

సమంత మైండ్ సెట్ కి తగ్గట్టుగానే.. లేటెస్ట్ గా కొందరు తమిళ్ ప్రొడ్యూసర్లు సామ్ తో సినిమాకు అప్రోచ్ అయ్యారని రాస్తోంది కోలీవుడ్ మీడియా. ఇప్పటికే విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో నయనతార, సమంత నటిస్తున్న మూవీ ప్రోగ్రెస్ లో వుంది. తన వెరీ నెక్స్ట్ మూవీ తమిళ్ లోనే రిలీజ్ కావాలని ఆశిస్తున్నారట సమంత. ఎంతయినా.. మన తమిళమ్మాయేగా అని తమిళ్ తంబీలు కూల్ అవుతారన్నది ఆమె కాన్ఫిడెన్స్ కావొచ్చు.

Also Read: ‘ఆహా’లో విడుద‌లైన అర్ధశతాబ్దం.. ఎలా ఉందంటే..?

ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి