Vidya Balan: ఐ డోంట్ కేర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.. ట్రోల్స్ ను పట్టించుకోనంటున్న ముద్దుగుమ్మ

'స్టీరియోటైప్ సినిమాలు బ్రేక్ చేయాలన్న ప్లానింగ్ అయితే నాకులేదు. కానీ మేకర్స్ అలాంటి సినిమాలే నాకు ఆఫర్ చేస్తున్నారు' అంటున్నారు విద్యా బాలన్.

Vidya Balan: ఐ డోంట్ కేర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.. ట్రోల్స్ ను పట్టించుకోనంటున్న ముద్దుగుమ్మ
Vidya Balan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 12, 2021 | 9:58 PM

Vidya Balan : ‘స్టీరియోటైప్ సినిమాలు బ్రేక్ చేయాలన్న ప్లానింగ్ అయితే నాకులేదు. కానీ మేకర్స్ అలాంటి సినిమాలే నాకు ఆఫర్ చేస్తున్నారు’ అంటున్నారు విద్యా బాలన్. అంతేకాదు తన లుక్‌ విషయంలో ఎలాంటి కామెంట్స్ వచ్చినా ఐ డోంట్ కేర్ అన్నది విద్యా కామెంట్‌. ‘నటి ఉండాల్సినంత హైట్‌ లేనని… మరీ లావుగా ఉన్నానని… బోల్డ్ రోల్స్ చేస్తున్నానని… ఇలా నా మీద చాలా ట్రోల్స్ ఉన్నాయి. అయితే అవేవి నాకు ఆఫర్స్ రాకుండా మాత్రం చేయలేకపోయాయి’ అన్నారు విద్యా. అంతేకాదు యాక్టింగ్ పట్ల నా పాషన్ నాకు ఇన్ని ఆఫర్స్ తెచ్చిపెడుతుంది అని గర్వంగా చెబుతున్నారీ బోల్డ్ బ్యూటీ. చిన్న బ్రేక్ అంటూ ఆ మధ్య సిల్వర్‌ స్క్రీన్‌కు షార్ట్ పాజ్ ఇచ్చిన విద్యా బాలన్… ఇప్పుడు మళ్లీ స్పీడు పెంచారు. వరుసగా డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. పాండిమిక్ టైమ్‌లోనూ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు విద్యా. ఫస్ట్ వేవ్ టైమ్‌లో శకుంతలా దేవి సినిమాతో సక్సెస్ సాధించారు.

ఇప్పుడు మరో డిఫరెంట్ రోల్‌లో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. డిజిటల్ రిలీజ్‌కు రెడీ అవుతున్న షేర్ని సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు విద్యా బాలన్‌. ఈ సినిమా కూడా తనకు ఓ డిఫరెంట్ ఎక్స్‌ పీరియన్స్ అంటున్నారీ వర్సటైల్ విమెన్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rashi Khanna : ప్రభాస్ భారీ సినిమాలో ఈ బాబ్లీ బ్యూటీ దాదాపు ఖరారైందట.. ఖుషీలో రాశి ఫ్యాన్స్..

Kambalapally kathalu : చాప్టర్ 2 కు సిద్దమవుతున్న కంబాలపల్లి కథలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు..

Niharika Konidela: అమ్మ చీర‌లే అందం.. న‌యా రూటులో బుట్టబొమ్మ‌లు.. ఎంత ముద్దుగా ఉన్నారో సుమీ..!