Katrina Kaif: క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత శ‌రీరానికి కాస్త స‌మ‌యం ఇవ్వాలి.. స్వీయ అనుభ‌వాన్ని వివ‌రించిన క‌త్రీనా..

Post Covid: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వ స‌మాజాన్ని అత‌లాకుతలం చేసింది. ఆరోగ్యాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని ఈ మాయ‌దారి రోగంతో ర‌క‌ర‌కాల వ్యాధులు వేధిస్తున్నాయి. బ్లాక్ ఫంగ‌స్‌, యెల్లో వైర‌స్...

Katrina Kaif: క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత శ‌రీరానికి కాస్త స‌మ‌యం ఇవ్వాలి.. స్వీయ అనుభ‌వాన్ని వివ‌రించిన క‌త్రీనా..
Katrina Kaif Post Covid
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 12, 2021 | 8:35 PM

Katrina Kaif: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వ స‌మాజాన్ని అత‌లాకుతలం చేసింది. ఆరోగ్యాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని ఈ మాయ‌దారి రోగంతో ర‌క‌ర‌కాల వ్యాధులు వేధిస్తున్నాయి. బ్లాక్ ఫంగ‌స్‌, యెల్లో వైర‌స్ అంటూ రోగాలు అంతు చిక్క‌డం లేదు. ఇక కరోనా నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా ప‌లు ఇబ్బందులు ఎదుర‌వుతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తిస్తున్నారు. క‌రోనా నుంచి కోలుకున్నాం క‌దా అని.. ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఉంటామంటే మాత్రం కుద‌ర‌ని చెబుతున్నారు వైద్య నిపుణులు కొంత కాలం పాటు ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ బ్యూటీ, అందాల తార క‌త్రీనా కైఫ్ త‌న స్వీయ అనుభ‌వాన్నిపంచుకున్నారు. ఏప్రిల్‌లో క‌త్రీనా కైఫ్ క‌రోనాబారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే స‌రైన చికిత్స తీసుకోవ‌డంతో క‌త్రీనా స‌కాలంలో క‌రోనా నుంచి కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే వ‌ర్క‌వుట్ల విష‌యంలో నెల‌కొన్న అనుమానాల నేప‌థ్యంలో క‌త్రీనా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కరోనా నుంచి కోలుకున్న త‌ర్వాత తిరిగి వర్క‌వుట్లు ఎప్ప‌డు మొద‌లు పెట్టాల‌న్న‌దానిపై ఈ బ్యూటీ స్పందిస్తూ.. `కరోనా నుంచి కోలుకున్న త‌ర్వాత తిరిగి వ‌ర్క‌వుట్లు చేయ‌డానికి ఓపిక ప‌ట్టాను. మీరు కూడా మీ శ‌రీరం మాట‌ను వినండి. శ‌రీరం పూర్తిగా క‌రోనా నుంచి కోలుకోవ‌డానికి కాస్త స‌మ‌యం ఇవ్వండి. అనంత‌రం నెమ్మ‌దిగా వ‌ర్క‌వుట్ల‌లో వేగాన్ని పెంచండి` అంటూ రాసుకొచ్చిందీ బ్యూటీ. ఇక క‌త్రీనా కెరీర్ విష‌యానికొస్తే ఈ బ్యూటీ ప్ర‌స్తుతం.. ఫోన్‌బూత్‌తో పాటు, టైగ‌ర్ 3 చిత్రాల్లో న‌టిస్తోంది.

క‌త్రీన్ చేసిన పోస్ట్‌..

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

Also Read: Disabled Students : దివ్యాంగులకు గుడ్‌న్యూస్..! మూడేళ్ల స్కాలర్‌షిప్ ప్రకటించిన NCPEDP.. మరిన్ని వివరాలు తెలుసుకోండి..

Anitha: తూచ్.. నేను అలా అన‌లేదు. త‌న యాక్టింగ్ కెరీర్‌కు సంబంధించి వ‌స్తోన్న వార్త‌ల‌ను ఖండించిన న‌టి అనిత‌..

In The Name Of  God: అంతు చిక్క‌ని క‌థాంశంతో ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’.. జూన్ 18 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌..

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..