AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shooting in The Town of Austin : టెక్సాస్‌లోని ఆస్టిన్ పట్టణంలో కాల్పులు.. 13 మందికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Shooting in Town of Austin : టెక్సాస్‌లోని ఆస్టిన్ పట్టణంలో కాల్పులు జరిగాయి. 13 మంది తీవ్రంగా గాయపడ్డారని

Shooting in The Town of Austin : టెక్సాస్‌లోని ఆస్టిన్ పట్టణంలో కాల్పులు.. 13 మందికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
Town Of Austin
uppula Raju
|

Updated on: Jun 12, 2021 | 10:06 PM

Share

Shooting in Town of Austin : టెక్సాస్‌లోని ఆస్టిన్ పట్టణంలో కాల్పులు జరిగాయి. 13 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని ఆస్టిన్ తాత్కాలిక పోలీసు చీఫ్ జోసెఫ్ చాకోన్ వివరించారు. ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆరుగురిని ఆసుపత్రికి తరలించగా, ఆస్టిన్-ట్రావిస్ కౌంటీ ఇఎంఎస్ మరో నలుగురిని మధ్యస్థ చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఒక ఆసుపత్రిలో 11 మంది బాధితులు చికిత్స పొందగా, మరొక వ్యక్తిని వేరే ఆసుపత్రికి తరలించారు. ఒక వ్యక్తి చాలా తుపాకీ గాయాలతో అత్యవసర సంరక్షణ కేంద్రానికి వెళ్ళాడని చాకోన్ తెలిపారు.

పోలీసులకు నిందితుడి గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. ఈ సంఘటన ఈ ప్రాంతానికి వేరుచేయబడినట్లు కనిపిస్తోంది. కానీ నిందితుడు అదుపులో లేనందున ఇంకా కాల్పులు జరిగే ప్రమాదం ఉందని చాకోన్ వివరించారు. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రస్తుతం పబ్లిక్ సేఫ్టీ కెమెరా సిస్టమ్, పోలీస్ బాడీ కెమెరాలు, బిజినెస్ నిఘా వీడియోతో సహా పలు మూలాల నుంచి కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాల్పుల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్, గ్యాంగ్ యూనిట్ల డిటెక్టివ్‌లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎందుకు కాల్పులు జరిపారో మాత్రం సరైన కారణాలు తెలియడం లేదు. ఎఫ్‌బిఐ జాయింట్ టెర్రరిజం టాస్క్‌ఫోర్స్ బృందం కూడా వచ్చినట్లు చాకోన్ తెలిపారు. షూటింగ్ జరిగిన కొద్దిసేపటికే 6 వ వీధి దిగువ ప్రాంతానికి ప్రజలు దూరంగా ఉండాలని ఆస్టిన్ పోలీసు విభాగం ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో కోరింది.

JIO New Plans: కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో.. వీటితో డేటా వినియోగానికి నో లిమిట్‌..

Vidya Balan: ఐ డోంట్ కేర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.. ట్రోల్స్ ను పట్టించుకోనంటున్న ముద్దుగుమ్మ

Pomegranate Peel: చెత్త‌లో ప‌డేసే దానిమ్మ తొక్క‌తో ఎన్నో లాభాలు? అవేంటో తెలిస్తే ఇక‌పై తొక్క‌ను అస్స‌లు పాడేయ్య‌రు..