Drone Bus: ట్రైన్ టికెట్ ఖర్చు..హెలికాప్టర్ ప్రయాణం..అదే డ్రోన్ బస్సు..రెడీ అవుతోంది!

Drone Bus: జోరుగా హుషారుగా షికారు పోదామా.. అంటూ ఎక్కడికైనా వెళ్ళాలంటే కారులో వెళ్ళడానికి పెట్రోల్ భారం. బస్సులు.. రైళ్ళు ఎక్కాలంటే ఆ రద్దీ తట్టుకునే కన్నా ఇంట్లోనే మంచిది అనిపించే ఫీలింగ్.

Drone Bus: ట్రైన్ టికెట్ ఖర్చు..హెలికాప్టర్ ప్రయాణం..అదే డ్రోన్ బస్సు..రెడీ అవుతోంది!
Drone Bus
Follow us
KVD Varma

|

Updated on: Jun 12, 2021 | 7:44 PM

Drone Bus: జోరుగా హుషారుగా షికారు పోదామా.. అంటూ ఎక్కడికైనా వెళ్ళాలంటే కారులో వెళ్ళడానికి పెట్రోల్ భారం. బస్సులు.. రైళ్ళు ఎక్కాలంటే ఆ రద్దీ తట్టుకునే కన్నా ఇంట్లోనే మంచిది అనిపించే ఫీలింగ్. ఇక మిగిలినవి విమానాలు.. అవి ఎక్కాలంటే మన బడ్జెట్ తల్లకిందులే. అందువల్ల దగ్గరలో ఉన్న టాంకు బండ్ దగ్గరకో.. కొంచెం అటుగా ఉన్న ఏ చిలుకూరు బాలాజీ దగ్గరకో పోయి కాలక్షేపం చేసి వచ్చేస్తాము. ఇప్పుడు ఆ బాధలు తప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు. ఈ ప్రయాణ ఇబ్బందులు తప్పించడానికి ఆకాశ మార్గంలో ప్రయాణమే సుఖం. కానీ ఖరీదు తో కూడుకున్నది కదా.. అందుకే అమెరికా లోని ఒక కంపెనీ కొత్తగా ఆలోచిస్తోంది. అదే డ్రోన్ ప్రయాణం. ఒకేసారి 40 మందిని తీసుకువెళ్ళేలా డ్రోన్ బస్సు సిద్ధం చేస్తే.. ట్రాఫిక్ సమస్య ఉండదు. రోడ్ల బాధ ఉండదు. అన్నట్టు ఇలాకానీ బస్సు సిద్ధం అయితే, మామూలు ట్రైన్ టికెట్ రేటుతో హెలికాప్టర్ లో వెళ్లినట్టు వెళ్లిపోవచ్చు ఎక్కడికైనా. ఇప్పటికే పరిశోధనలు పూర్తి చేసిన ఈ కంపెనీ.. త్వరలోనే ఈ డ్రోన్ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది.

ఊబర్ ఎయిర్ టాక్సీ..

ఇక మరోవైపు ఊబర్ కంపెనీ కూడా ఈరకమైన గాలిలో ప్రయాణం నేనూ సిద్ధం చేస్తున్నాను అంటోంది. ఎయిర్ టాక్సీ సిస్టం ప్రవేశాపెదతాం. సిటీల్లో ట్రాఫిక్‌‌‌‌ కష్టాలు లేకుండా లేకుండా చేస్తామని ఊబర్ చెబుతోంది. నలుగురు మాత్రమే ప్రయాణించేలా ఎయిర్ టాక్సీకి రూపకల్పన చేస్తున్నారట. అది 2023 సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందని ఊబర్ అంటోంది.

ఇంతకు ముందు మనం చెప్పుకున్న డ్రోన్ బస్సు ఆలోచన ఊబర్ నుంచే తీసుకున్నది. న్యూయార్క్ కు చెందిన ఓ కంపెనీ ఇలా ఎలక్ట్రిక్ డ్రోన్ బస్సు సిద్ధం చేస్తోంది. ఈ కంపెనీ పేరు కేలోకోన. ఇది మామూలు డ్రోన్ ఎగిరినట్టుగానె గాలిలో ఎగురుతుందట.

ఈ బస్సు ఎలా ఉంటుందంటే..

ఒక క్లోజ్డ్‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌లా ఈ బస్సు ట్రావెల్ చేస్తుందని ఆ సంస్థ చెబుతోంది. డ్రోన్‌‌‌‌కు ఒక ఫ్లైయింగ్ సాసర్‌‌‌‌‌‌‌‌ను అటాచ్‌‌‌‌ చేసినట్లుగా డ్రోన్‌‌‌‌ బస్‌‌‌‌ కనిపిస్తుంది. దీని ఫంక్షనింగ్ అంతా పూర్తిగా ఫ్లైట్‌‌‌‌లో ఉన్నట్టే ఉంటుంది. మూవబుల్‌‌‌‌ ప్రొపెల్లర్స్‌‌‌‌తో కూడిన ఎనిమిది భారీ ఫ్యాన్స్‌‌‌‌. ఫ్లైట్‌‌‌‌ మాదిరిగానే టేకాఫ్, ల్యాండింగ్‌‌‌‌ గేర్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్స్. టెస్లా మోడల్ ఎస్, మోడల్ 3 కార్లలో వాడే బ్యాటరీ సిస్టమ్‌‌‌తో డ్రోన్ బస్సు నడుస్తుంది. 3.6 మెగావాట్‌‌‌‌ అవర్స్ కెపాసిటీ ఉండే జంబో బ్యాటరీ దీనికి అమరుస్తారు. ఈ పవర్‌‌‌‌‌‌‌‌తో కొన్ని వేల ఇండ్లకు కరెంట్ సప్లై చేయొచ్చంటున్న కంపెనీ. డ్రోన్‌‌‌‌ బస్సులో మొత్తంగా బ్యాటరీని మార్చి, మరోదానిని పెట్టుకునేలా డిజైన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రీచార్జ్‌‌‌‌ చేసేందుకు టైమ్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ కాకుండా మరో బ్యాటరీ మార్చుకునే సదుపాయం కూడా దీనికి కల్పిస్తున్నారు. ఈ బస్సును మిలటరీ, కార్గో అవసరాలకూ వాడొచ్చు. స్పీడ్ ట్రావెల్‌‌‌‌కు ఉపయోగపడేలా చిన్న ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్స్‌‌‌‌ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే, అందులో ఆరుగురు మాత్రమే ప్రయాణం చేయవచ్చు. ట్రావెల్‌‌‌‌ చార్జ్ చాలా ఎక్కువ. ఒకే ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌లో ఎక్కువ మంది ప్రయాణించేలా ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ డెవలప్ చేసే ఆలోచనతోనే డ్రోన్ బస్. దీనితో టికెట్ ధర తగ్గించవచ్చన్న కెలెకొన సంస్థ. డ్రోన్‌‌‌‌ బస్సును పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌తో పాటు యుద్ధం జరిగే ప్రాంతాలకు సైనికులను తరలించేందుకు అనుకూలంగా ఉంటుంది. మామూలు కార్గో అవసరాలకు కూడా వాడుకోవచ్చు

గంటకు 400 కిలోమీటర్లు ప్రయాణం చేసే కెపాసిటీ ఈ డ్రోన్ బస్సుకు ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవాళ్లు రోడ్డుపై వెళ్లాలంటే చాలా టైమ్‌‌‌‌ పడుతున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. దీనివలన ఎదురయ్యే రోడ్‌‌‌‌ ట్రాఫిక్, పొల్యూషన్ లాంటి సమస్యలు ఉండవు. అదేవిధంగా మిడిల్‌‌‌‌ క్లాస్‌‌‌‌ వాళ్లు ఫ్లైట్‌‌‌‌లో ప్రయాణానికి ఎక్కువ ఖర్చు పెట్టలేకపోవచ్చు అందుకే ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ క్రాఫ్ట్‌‌‌‌ను డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించిన కెలెకొన కంపెనీ ఫౌండర్ బ్రేడెన్ కెలెకొన.

ఎక్కడ వస్తుంది..

ముందుగా అమెరికాలోని మన్‌‌‌‌హట్టన్ – హాంప్టన్‌‌‌‌ రూట్‌‌‌‌లో దీని సర్వీసులు స్టార్ట్ చేసే ఆలోచనలో కంపెనీ ఉంది. ఆ తర్వాత న్యూయార్క్, లాస్‌‌‌‌ఎంజిలిస్, శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కోలకు విస్తరించాలని అనుకుంటున్నారు. ప్యారిస్, లండన్‌‌‌‌ లోను వీటిని ప్రారంభించాలనే ప్లాన్ ఉందని చెబుతున్నారు. మన్‌‌‌‌హాట్టన్ నుంచి హాంప్టన్ మధ్య దూరం సుమారు 200 కిలోమీటర్లు. అర గంటలోనే ఆ మార్గంలో ట్రావెల్ చేయొచ్చు అని బ్రేడెన్ కెలెకొన చెబుతున్నారు. దీనికి ఖర్చు కూడా ట్రైన్‌‌‌‌ టికెట్‌‌‌‌తో సమానంగా ఉంటుందట. కేవలం 85 డాలర్లు మాత్రమే చార్జ్‌‌‌‌ ఉంటుందన్న కెలెకొన సంస్థ. డెవలప్‌‌‌‌మెంట్ స్టేజ్‌‌‌‌లో ఉన్న ఈ డ్రోన్‌‌‌‌ బస్సులు 2022 నాటికి రెడీ అవుతాయని ప్రకటించిన కంపెనీ. ప్రజలకు అందుబాటులోకి రావడానికి మాత్రం మరో రెండేళ్లు పట్టొచ్చు అంటోంది.

Also Read: Syska Smart Watch: సిస్కా నుంచి స్మార్ట్ వాచ్‌లు… శానిటైజ‌ర్ రిమాండ‌ర్ ప్ర‌త్యేక ఫీచ‌ర్‌.. 50 శాతం డిస్కౌంట్‌తో..

గబ్బిలాలను వదలని చైనా శాస్త్రజ్ఞులు…….24 కొత్త కరోనా వైరస్ లను కనుగొన్నామని వెల్లడి.. ‘వూహాన్ థియరీకి’ చెక్ పెట్టేందుకేనా ..?

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!