Viral Video: కారులో వచ్చాడు.. ఎవరూ లేనిది చూసి 10 నాటు కోళ్లను ఎత్తుకెళ్లాడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Viral Video: కారులో వచ్చారు.. అటూ ఇటూ అంతా గమనించారు.. ఎవరూ లేరని గమనించి అందిన కాడికి దోచుకెళ్లారు. ఇంతకీ వారేం..

Viral Video: కారులో వచ్చాడు.. ఎవరూ లేనిది చూసి 10 నాటు కోళ్లను ఎత్తుకెళ్లాడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Thieve
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 13, 2021 | 5:29 AM

Viral Video: కారులో వచ్చారు.. అటూ ఇటూ అంతా గమనించారు.. ఎవరూ లేరని గమనించి అందిన కాడికి దోచుకెళ్లారు. ఇంతకీ వారేం దోచుకెళ్లారో తెలిస్తే షాక్ అవుతారు. ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి ఓ చికెన్ షాపు నుంచి 10 కోళ్లను దొంగించాలిరు. ఈ షాకింగ్ ఘటన చెన్నై నగరం పాడిలోని వల్లార్ వీధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన మే 30న చోటు చేసుకోగా.. ఆ దొంగతనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఈ కోళ్ల దోపిడీ గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మే 30 వ తేదీన తెల్లవారు జామున వల్లార్ వీధిలోని ఓ చికెన్ షాపు వద్దకు ఒక కారు వచ్చింది. డ్రైవింగ్ సీట్ నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి లుంగీ ధరించి ఉన్నాడు. దాదాపు ఒక ఐదు నిమిషాల పాటు అక్కడే నిల్చుని చుక్కుపక్కల ప్రజల కదలికలను గమనించాడు. ఈ మధ్య గ్యాప్‌లోనే ఓ బాలుడు కారు నుంచి దిగి మళ్లీ ఎక్కాడు. కొద్ది నిమిషాల తరువాత వెనుక సీట్‌లో కూర్చున్న ఓ మహిళ కార్ డోర్ ఓపెన్ చేసింది. ఆ తరువాత అప్పటికే బయట కాచుకుని కూర్చున్న వ్యక్తి.. దుకాణంలో చొరబడి అందులోంచి కోళ్లు తెచ్చి కారులో పడేసాడు.

అలా మూడు దఫాలుగా పది కోళ్లను కారులో వేసుకుని కారు ఎక్కడాడు. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ఈ ఘటన అంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనిపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసి ఫుటేజీ‌లో కనిపిస్తున్న కారు, దాని నెంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. కొన్ని వారాల క్రితం కొరత్తూరులోని ఒక మాంసం దుకాణం నుండి మేకలు తప్పిపోయినట్లు ఫిర్యాదు అందాయి. దాంతో ఈ రెండు చోరీల వెనుక ఒకే ముఠా హస్తం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

CC TV Footage:

Also read:

Euro 2020 Denmark vs Finland: యూరో కప్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఘోరం.. ఆట మధ్యలో కుప్పకూలిన డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్..