AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI UPI Services: ఎస్‌బిఐ నెట్‌బ్యాంకింగ్, యాప్, యూపీఐ సేవలు బంద్.. ఏ టైమ్‌ నుంచి ఏ టైమ్ వరకు అంటే..

SBI UPI Services: నిర్వహణ కార్యకలాపాల కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ యోనో...

SBI UPI Services: ఎస్‌బిఐ నెట్‌బ్యాంకింగ్, యాప్, యూపీఐ సేవలు బంద్.. ఏ టైమ్‌ నుంచి ఏ టైమ్ వరకు అంటే..
Sbi
Shiva Prajapati
|

Updated on: Jun 13, 2021 | 5:33 AM

Share

SBI UPI Services: నిర్వహణ కార్యకలాపాల కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ యోనో, యుపిఐ సేవలు ఆదివారం నాడు నాలుగు గంటల పాటు ఆగిపోనున్నాయి. ఈ విషయాన్ని ఎస్‌బిఐ ప్రకటించింది.

‘‘మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్నందున మా గౌరవనీయ కస్టమర్లు ఈ అసౌకర్యా్న్ని భరించాల్సి ఉంటుందని అభ్యర్థిస్తున్నాము’’ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎస్‌బిఐ.. జూన్ 13న 02:40 గంటల నుండి 06:40 గంటల మధ్య నిర్వహణ కార్యకలాపాలను చేపట్టనున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ / యోనో / యోనో లైట్ / యుపిఐ సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బిఐ స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే.. కోవిడ్ చికిత్స-సంబంధిత వ్యయాల కారణంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వినియోగదారుల కోసం ‘కవాచ్ పర్సనల్ లోన్’ అనే లోన్ స్కీమ్‌ను ఎస్‌బిఐ తాజాగా ప్రవేశపెట్టింది. కోవిడ్ చికిత్స కోసం సంబంధిత వ్యక్తి, వారి కుటంబ సభ్యుల వైద్య ఖర్చులను భరించటానికి వినియోగదారులకు సహాయపడటం లక్ష్యంగా 8.5 శాతంతో రూ. 5 లక్షల వ్యక్తిగత రుణాలను ఎస్‌బిఐ అందిస్తోంది.

Also read:

Viral Video: కారులో వచ్చాడు.. ఎవరూ లేనిది చూసి 10 నాటు కోళ్లను ఎత్తుకెళ్లాడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..