PF Balance Check: ఇపిఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి..

PF Balance Check: భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక భద్రతా సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) వినియోగదారులు..

PF Balance Check: ఇపిఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి..
Epf
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 13, 2021 | 5:38 AM

PF Balance Check: భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక భద్రతా సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) వినియోగదారులు తమ ఇపిఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడం, వారి ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించిన ఇతర సమాచారాన్ని తెలుసుకోవడం మరింత సులభతరం చేసింది. ఇపిఎఫ్ ఖాతాదారులు.. ఫోన్, కంప్యూటర్, ఉంటే చాలు తమ ఇపిఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌ను కేవలం రెండు నిమిషాల్లో తెలుసుకోవచ్చు.

ఎస్ఎంఎస్ ద్వారా ఇపిఎఫ్ బ్యాలెన్స్ చెక్: మీ ఇపిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం కోసం మీరు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ నుండి EPFOHO UAN LAN అని 7738299899 ఎస్ఎంఎస్ పంపాలి. అలా ఎస్ఎంఎస్ పంపిన తరువాత నిమిషాల వ్యవధిలోనే.. మీ ఇపిఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌తో సహా మీ ఖాతా గురించిన సమాచారాన్ని కలిగి ఉన్న ఎస్ఎంఎస్ మీ ఫోన్‌కు వస్తుంది.

మిస్డ్ కాల్ ద్వారా ఇపిఎఫ్ బ్యాలెన్స్ చెక్: మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406 కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. రింగ్ అయిన తరువాత కాల్ కూడా ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. అలా డిస్‌కనెక్ట్ అయిన కాసేపటికే మీ ఇపిఎఫ్ ఖాతా వివరాలు మీ ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి.

ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇపిఎఫ్ బ్యాలెన్స్ చెక్: మీ ఇపిఎఫ్ ఖాతా బ్యాలెన్స్, ఇతర వివరాలను తనిఖీ చేయడానికి.. మీరు ఇపిఎఫ్ఓ పాస్‌బుక్ పోర్టల్‌కు కూడా లాగిన్ అవ్వవచ్చు. అలా లాగిన్ అవ్వడానికి మీకు మీ యూనివర్సల్ ఖాతా సంఖ్య (UAN) అవసరం ఉంటుంది.

1. మీకు మీ UAN ఉంటే నేరుగా అకౌంట్ లాగిన్ అవ్వొచ్చు. ఒకవేళ మీకు UAN లేకపోతే.. ఇ-సేవా పోర్టల్‌కు వెళ్లి “మీ UAN నెంబర్‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ పేజీకి దిగువన ‘ఇ-సేవా పోర్టల్‌’ ఆప్షన్ ఉంటుంది. దానిపైక్లిక్ చేసి మీ UAN నెంబర్‌ను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ UAN నెంబర్ క్రియేట్ చేయకపోతే.. ‘క్రియేట్ UAN’ ఆప్షన్‌ని క్లిక్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

2. ఇపిఎఫ్ పాస్‌బుక్ పోర్టల్‌కు వెళ్లాలి. లేదా మెంబర్ ఇ-సేవా పోర్టల్ ఉపయోగించి అదే లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు.

3. పాస్‌బుక్ పోర్టల్‌లోకి వెళ్లిన తరువాత మీ UAN, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

4. ఇపిఎఫ్ పాస్‌బుక్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత ‘డౌన్‌లోడ్ / వీక్షణ పాస్‌బుక్’ పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే.. మీ పాస్‌బుక్ ఓపెన్ అవుతుంది. దానిని మీరు ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.

Also read:

SBI UPI Services: ఎస్‌బిఐ నెట్‌బ్యాంకింగ్, యాప్, యూపీఐ సేవలు బంద్.. ఏ టైమ్‌ నుంచి ఏ టైమ్ వరకు అంటే..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ