Suicide Attempt: డ్రంకెన్ డ్రైవ్.. ఉద్యోగం కోల్పోయిన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..
Constable Suicide Attempt: డ్రంకెన్ డైవ్‌లో పట్టుబడి.. ఉద్యోగం కోల్పోయిన ఓ కానిస్టేబుల్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన
Constable Suicide Attempt: డ్రంకెన్ డైవ్‌లో పట్టుబడి.. ఉద్యోగం కోల్పోయిన ఓ కానిస్టేబుల్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. అత్తాపూర్‌కు చెందిన వెంకటేశ్ బహద్దూర్‌పురా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 123 వద్ద ఈ నెల 9వ తేదీన రాత్రి రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో వెంకటేశ్ పట్టుబడ్డాడు. అయితే ఆరోజు తాను తాగలేదని వెంకటేశ్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అవసరమైతే బహద్దూర్‌పురా పోలీస్ స్టేషన్ అధికారులను కనుక్కోవాలని ట్రాఫిక్ పోలీసులతో వాదించాడు.
అతని మాట వినకుండా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వెంకటేశ్‌పై కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు నగర పోలీస్ కమిషనర్ వెంకటేశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం విధులకు హాజరైన వెంకటేశ్ చేతులకు సస్పెన్షన్ ఉత్తర్వులను అందజేశారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్ ఇంటికి వెళ్లి అనంతరం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం లంగర్‌హౌజ్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేశ్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బహద్దూర్‌పురా ఎస్‌ఐ నర్సింహరావు మీడియాకు తెలిపారు.
Also Read: