Horrific Incident: మాంసం కోసం క్రూరం.. ప్రాణాలతో ఉన్న పాడిగేదెల తొడలు కొసిన దుర్మార్గులు..

Siddipet District: ఇటీవల కాలంలో కొంతమంది మృగాల్లా, క్రూరంగా వ్యవహరిస్తున్నారు. మాంసం కొసం కొందరు ప్రాణంతో ఉన్న పాడి పశువుల

Horrific Incident: మాంసం కోసం క్రూరం.. ప్రాణాలతో ఉన్న పాడిగేదెల తొడలు కొసిన దుర్మార్గులు..
Horrific Incident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 13, 2021 | 10:48 AM

Siddipet District: ఇటీవల కాలంలో కొంతమంది మృగాల్లా, క్రూరంగా వ్యవహరిస్తున్నారు. మాంసం కొసం కొందరు ప్రాణంతో ఉన్న పాడి పశువుల తొడలను అత్యంత క్రూరంగా కోశారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల శివారులో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. నలుగురు యువకులు కలిసి పదునైన కత్తులతో పాడి పశువుల తొడలను కోశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసినగండ్ల-దమ్మకపల్లి గ్రామాల మధ్య రాజేందర్‌రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో నేపాల్‌కు చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు పని చేస్తున్నారు. రాజగిరి వెంకటేశం అనే రైతు శుక్రవారం సాయంత్రం పొలంలోని పాకలో ఉన్న తన గేదెల నుంచి పాలు పిండుకుని ఇంటికి వెళ్లిపోయాడు.

అనంతరం రాత్రి వేళ నలుగురు యువకులు కలిసి మాంసం కోసం రెండు గేదెల తొడ భాగాలను కోసేయడంతో అవి తీవ్ర రక్తస్రావమై మరణించాయి. శనివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు వాటిని చూసి హతాశుడయ్యారు. అనంతరం ఏమై ఉంటుందోనని.. గ్రామస్థులతో కలిసి చుట్టుపక్కల గాలించగా వ్యవసాయక్షేత్రంలో నిందితులు కనిపించారు. మాంసాన్ని వండేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామస్థులను చూసిన ముగ్గురు నిందితులు పారిపోయారు. నేపాలీ యువకుడు సందీప్‌ (25) పట్టుబడ్డాడు. అతడిని నిలదీయడంతో జరిగిన విషయం మొత్తం చెప్పాడు.

అనంతరం గ్రామస్థులు సిద్దిపేట పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి త్రీ టౌన్‌ పోలీసులు చేరుకొని పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని.. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

బిర్యానీ తెచ్చిన తంటాలు.. సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియో వైరల్‌.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

Wife Cheating: ప్రియుడితో బెడ్‌రూమ్‌లో భార్య.. అది చూసిన భర్త బయటి నుంచి గడియ పెట్టాడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..