AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acid attack : వివాహితపై యాసిడ్ దాడి, కృష్ణా జిల్లా గణపవరంలో దారుణం

కృష్ణాజిల్లా గణపవరంలో దారుణం జరిగింది. వెంకాయమ్మ అనే వివాహితపై గోపి అనే వ్యకి యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో బాధితురాలి శరీరమంతా మంటలు రావడంతో మైలవరం..

Acid attack : వివాహితపై యాసిడ్ దాడి, కృష్ణా జిల్లా గణపవరంలో దారుణం
Acid Attack
Venkata Narayana
|

Updated on: Jun 13, 2021 | 10:44 AM

Share

Acid attack on married women : కృష్ణాజిల్లా గణపవరంలో దారుణం జరిగింది. వెంకాయమ్మ అనే వివాహితపై గోపి అనే వ్యకి యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో బాధితురాలి శరీరమంతా మంటలు రావడంతో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా గోపీతో వెంకాయమ్మ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవల కొన్ని రోజుల నుంచి వీరిరువురి మధ్య మనస్పర్థలు రావడంతో ఆగ్రహానికి గురైన గోపి యాసిడ్ దాడికి పాల్పడ్డట్టు సమాచారం. విభేదాల క్రమంలో తనతో మాట్లాడడం లేదని అక్కసు పెంచుకున్న గోపి, వెంకాయమ్మ పై యాసిడ్ తో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలాఉండగా, తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మరో విస్తుపోయే ఘటన వెలుగుచూసింది.   తనను మోసం చేస్తూ ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఓ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. తన భార్య, ఆమె ప్రియుడు ఇంట్లో ఉండటాన్ని గమనించిన భర్త.. వారిద్దరినీ గదిలో బంధించి తాళం వేశాడు. అనంతరం పోలీసులను పిలిపించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా బైంసాలోని ఏపీ నగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగరాజు, తన భార్యతో కలిసి భైంసాలోని ఏపీ నగర్‌లో నివాసముంటున్నాడు. అయితే, నాగరాజు భార్య రూపేష్ అనే మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది. తొలుత నాగరాజు దంపతుల కాపురం సాఫీగానే సాగినా.. ఆ తరువాత భార్య అసలు నిజస్వరూపం బయటపడింది. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న నాగరాజు.. తన భార్యను పలుమార్లు హెచ్చరించాడు.

ఈ వార్నింగ్‌లను పట్టించుకోకపోగా.. మరింత రెచ్చిపోయింది. అతని మాటలను బేఖాతరు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా నాగరాజు భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి బెడ్‌రూమ్‌లో ఉండగా.. నాగరాజు గమనించాడు. వెంటనే వారు ఉన్న గది బయటి నుంచి తాళం వేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నాగరాజు ఇంటికి వచ్చి అతని భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుందామని ప్రయత్నించగా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో భయపడిన వీరు.. గది లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. పోలీసులు ఎంత చెప్పినా తలుపులు తీయలేదు. దాదాపు నాలుగు గంటల పాటు పోలీసులకు వారు చుక్కలు చూపించారు. చివరికి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Read also : Coronavirus : మరోసారి కనిష్ఠ స్థాయిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు, కాని.. భయపెడుతోన్న మరణాలు

Sharad Pawar : రాష్ట్రపతి రేసులో శరద్ పవార్..! ప్రశాంత్ కిశోర్ తో భేటీ తర్వాత సరికొత్త ఊహాగానాలు