Coronavirus : మరోసారి కనిష్ఠ స్థాయిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు, కాని.. భయపెడుతోన్న మరణాలు

యావత్ భారత దేశాన్ని భయపెట్టిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంచెం కొంచెం తగ్గుముఖం పడుతోంది. దేశంలో తాజాగా మరోసారి కనిష్ఠ స్థాయిలో రోజువారీ..

Coronavirus : మరోసారి కనిష్ఠ స్థాయిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు, కాని..  భయపెడుతోన్న మరణాలు
Corona Cases
Follow us

|

Updated on: Jun 13, 2021 | 9:55 AM

Coronavirus Updates : యావత్ భారత దేశాన్ని భయపెట్టిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంచెం కొంచెం తగ్గుముఖం పడుతోంది. దేశంలో తాజాగా మరోసారి కనిష్ఠ స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు లెక్కతేలాయి. వరుసగా ఆరో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసుల నమోదు కావడం కొంచెం ఉపశమానాన్నిస్తోంది. మరోవైపు, దేశంలో కరోనా టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 25 కోట్లు దాటింది. అయితే, కరోనా బాధిత మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 80,834 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3,303 మంది మృతి చెందారు.

నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకున్న బాధితులు 1,32,062 మంది ఉండగా, దీంతో దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,94,39,989 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 10,26,159 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న మొత్తం బాధితులు 2,80,43,446 మంది. కొవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకు 3,70,384 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 95.26%, మరణాల రేటు 1.26% ఉంది.

ఇలాఉండగా, కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనాకు వ్యతిరేకంగా కొనసాగుతున్న టీకా డ్రైవ్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. శనివారం నాటికి టీకా డ్రైవ్‌ 148వ రోజుకు చేరింది. ఇప్పటివరకు 25,28,78,702కు పైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో 20,46,01,176 తొలి టీకా డోసులు వేసి మరో మైలురాయిని అధిగమించినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం పేర్కొంది.

శనివారం ఒకే రోజు మొత్తం 31,67,961 వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు చెప్పింది. ఇందులో తొలి డోసును 28,11,307 మంది లబ్ధిదారులకు వేయగా, మరో 3,56,654 మంది లబ్ధిదారులకు రెండో మోతాదును అందజేసినట్లు తెలిపింది. 18-44 ఏజ్‌ గ్రూప్‌లో 18,45,201 మంది లబ్ధిదారులు మొదటి మోతాదును వేయగా.. 1,12,633 మంది లబ్ధిదారులకు సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ అందించినట్లు పేర్కొంది. కాగా.. థర్డ్ వేవ్ ఉంటుందన్న సూచనలతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తోంది.

Read also : Sharad Pawar : రాష్ట్రపతి రేసులో శరద్ పవార్..! ప్రశాంత్ కిశోర్ తో భేటీ తర్వాత సరికొత్త ఊహాగానాలు