Etela Rajender: బీజేపీలో చేరనున్న ఈటల రాజేందర్‌.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి…

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ఇవాళ బీజేపీలో చేరున్నారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. బీజేపీ జాతీయ కార్యాలయంలో ఈ ఉదయం 11 గంటల తర్వాత ఈటల రాజేందర్‌

Etela Rajender: బీజేపీలో చేరనున్న ఈటల రాజేందర్‌.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి...
Etela Rajender


మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ఇవాళ బీజేపీలో చేరున్నారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. బీజేపీ జాతీయ కార్యాలయంలో ఈ ఉదయం 11 గంటల తర్వాత ఈటల రాజేందర్‌‌తోపాటు ఇతర నేతలు కూడా ఆ పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, రమేశ్‌ రాథోడ్, తుల ఉమతోపాటు ముఖ్యనేతలు మొత్తంగా 20 మంది వరకు పార్టీలోచేరనున్నారు. సభ్యత్వం తీసుకున్న తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత సాయంత్రానికి అమిత్ షా ను ఆయన నివాసంలో కలవనున్నారు. రాత్రికి అక్కడే ఉండి మంగళవారం ఉదయం తిరిగి షామీర్‌‌పేట్‌కు చేరుకోనున్నారు. తనతోపాటు పార్టీలో చేరే నేతలు, బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లడానికి రాజేందర్‌ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఇతర నేతలు పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఢిల్లీలోనే ఉండగా… జమ్మూ కశ్మీర్‌లో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఢిల్లీకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా తిరిగి 15న హైదరాబాద్‌కు చేరుకుంటారు.

లైవ్ ఇక్కడ చూడండి…

ఇవి కూడా చదవండి: IRCTC Latest News: ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు.. తిరిగి ప్రారంభమవుతున్న రైళ్లు ఇవే..

SBI Customer Alart: ఇలా చేస్తే మీరు ఇబ్బందులు పడాల్సిందే.. మరోసారి ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ..!