CM KCR Review: అందరి భాగస్వామ్యంతోనే నూటికి నూరుశాతం అభివృద్ధి.. సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు..
పల్లె, పట్టణ ప్రగతిపై అదనపు కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని...
పల్లె, పట్టణ ప్రగతిపై అదనపు కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.
పల్లెలు, పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు అంతా రెడీ కావాలన్నారు. ఇందులో భాగంగా తాను కూడా ఓ జిల్లాను దత్తత తీసుకోనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అదేవిధంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
సర్పంచులకు కిందిస్థాయి ఉద్యోగులకు తెలియని విషయాలను నేర్పిస్తూ, వారి సామర్ధ్యాలను పెంచుతూ వారిని గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధిలో కేరళ ఆదర్శంగా నిలిచిందని కేరళ పర్యటనకు కొంతమంది అదనపు కలెక్టర్లను, డీపీవోలను ఎంపిక చేసి పంపాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ కూడా ఆదర్శంగా తీసుకున్నదన్నారు.