Monsoon update: రైతులకు ముఖ్య సూచన.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..

Monsoon Rain: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురియనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..

Monsoon update: రైతులకు ముఖ్య సూచన.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..
Moonsoon
Follow us

|

Updated on: Jun 13, 2021 | 5:27 PM

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురియనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్‌ స్థాయి వరకు వ్యాపించింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలంగాణలో..

ఆదివారం ఉత్తర పశ్చిమ ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర తెలంగాణ, ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వరకు 4.5 నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో…

అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం  తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో మూడు రోజుల పాటు ఉరుములు… మెరుపులతో కూడిన తేలికపాటు జల్లులు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఈ మూడు వర్షాల పాటు కురిసే వర్షాలు వ్యవసాయానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ వర్షాల తర్వాత రైతు పూర్తిస్థాయిలో తమ పనుల్లో బిజీగా మారిపోతాడు.

ఇవి కూడా చదవండి : Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు జాబితా రెడీ.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి నిధులు..

CJ NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు… మరో రోజు యాదాద్రి దర్శనంకు రానున్న చీఫ్ జస్టీస్