T.Congress: అలక పాన్పుపై మరో టి.కాంగ్రెస్ నేత.. గాంధీ భవన్‌కు దూరంగా..

కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాలు, కలహాలు. ఎవ‌రు.. ఎప్పుడు ఎటు వైపు వుంటారో.. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌నేది ఊహించ‌డ‌మే క‌ష్టం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా సైలెంట్ అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరో కీలకమైన నేత ఇప్పుడు అలక పాన్పు ఎక్కాడు..

T.Congress: అలక పాన్పుపై మరో టి.కాంగ్రెస్ నేత.. గాంధీ భవన్‌కు దూరంగా..
Telangana Cong
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Sanjay Kasula

Updated on: Jan 28, 2022 | 3:27 PM

Telangana Congress కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాలు, కలహాలు. ఎవ‌రు.. ఎప్పుడు ఎటు వైపు వుంటారో.. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌నేది ఊహించ‌డ‌మే క‌ష్టం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా సైలెంట్ అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరో కీలకమైన నేత ఇప్పుడు అలక పాన్పు ఎక్కాడు.. ఎవరా నేతా..? ఎందుకు మౌనంగా వుంటున్నారో..? కాంగ్రెస్ పార్టీ అంటేనే రెండు గొడవలు, ఆరు అసంతృప్తులు, అదో టైపు రాజకీయం నడుస్తువుంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట ఎవ‌రికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఒక్కో సారి పార్టీకి ఇబ్బందిగా మారొచ్చు.. ఇంకో సారి వ్యక్తుల మధ్య విభేదాలకు దారితీయవచ్చు.. ఏదేమైనా ఆ పార్టీ నాయకుల తీరు అంతే.. ఎవరి దారి వారిది..

అయితే ఇప్పుడు తెలంగాణ  కాంగ్రెస్‌లో అదే ట్రెండ్ న‌డుస్తోంది. సీనియ‌ర్ నేత‌లంద‌రూ త‌మ‌కు తగిన గౌర‌వం ద‌క్క‌డం లేదంటూ వ‌రుస‌గా అలుగుతున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు నేత‌లు సైలెంట్ కాగా.. ఇప్పుడు సీనియ‌ర్‌నేత కాంగ్రెస్ ఎల‌క్ష‌న్ మేనేజ్మెంట్ చైర్మ‌న్‌గా ఉన్న దామోద‌ర రాజ‌న‌ర్సింహ సడెన్ గా సైలెంట్ అయ్యారు.

మొదట్లో తనకు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు ఇవ్వడం లేదని.. అంతే కాక తను చైర్మన్ గా ఉన్న అంశాల విషయంలోనూ తనకు సమాచారం ఇవ్వడం లేదని దామోదర రాజనర్సింహ గుర్రుగా ఉన్నారట. పార్టీకి సంబంధించి ఎటువంటి విషయాలు రేవంత్ త‌న‌తో మాట మాత్ర‌మైన సంప్ర‌దించ‌డం లేద‌ని దామోద‌ర తన సన్నిహితుల వద్ద చెప్తున్నారట.. అందుకే గ‌త కొన్ని రోజులుగా దామోదర రాజనర్సింహ గాంధీ భవన్ వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదనే చర్చ నడుస్తోంది..

అలాగే ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు దామోద‌ర ఆధ్వ‌ర్యంలో గ‌తంలో ఒక క‌మిటీ వేశారు.. ఆ మీటింగులకి కూడా ఆయన హాజరు కాలేదు ఆయన లేకుండానే మీటింగ్ లు కూడా కానిచ్చేశారు మిగతా సభ్యులు. అంతే కాదు ఇటీవల కాలంలో జరిగిన ఏ మీటింగ్ కి కూడా హాజరు కావట్లేదు ఈ మాజీ డిప్యూటీ సీఎం.

ఇప్ప‌టికే అనేక మంది సీనియ‌ర్లు పార్టీ కార్యాక‌లాపాల‌కు దూరంగా ఉండ‌గా.. తాజాగా దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఆ గ్రూప్ లోకి చేరారు. మునుముందు ఈ జాబితాలో ఇంకా ఎంత మంది చేరుతార‌నేది వేచి చూడాలి.

అశోక్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్.

ఇవి కూడా చదవండి: Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు వంట చేయడంలో ప్రావీణ్యులు.. అందులో మీరున్నారా..

Tata – Air India: 69 ఏళ్ల తరువాత పుట్టింటికి ఎగిరిపోయింది.. కానీ ప్రభుత్వానికి ఆ సమస్య అలాగే ఉంది..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!