Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డైలాగ్.

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు...! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్
Hindupuram
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 28, 2022 | 2:07 PM

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు…! ఇప్పుడు ఇదీ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డైలాగ్. అదేంటి బాలకృష్ణ డైలాగ్ మారిందే అనుకుంటున్నారా.. అవును కొత్త జిల్లాల ప్రకటన నేపథ్యంలో డైలాగ్ మారింది.. స్వరం మారుతోంది. అనంతపురంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఒక ఉద్యమాన్నే తీసుకొస్తోంది. అంతే కాదు బంద్ లు, నిరసనలతో హిందూపురం దద్దరిల్లుతోంది. అసలు ఎందుకీ వివాదం.. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏ ప్రాంతంలో లేని విధంగా అనంతపురం (Anantapur) హిందూపురం ప్రాంత వాసులుకున్న అభ్యంతరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెడుతోంది. ఇందులో ప్రధానమైంది. అనంతపురం జిల్లా. ప్రభుత్వం కొత్త జిల్లా ప్రకటించిన వెంటనే అనంతపురం జిల్లా అంతటా సంబురాలు మిన్నంటాయి. దీనికి కారణంగా ఎన్నో ఏళ్ల కల అయిన సత్యసాయి బాబా పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు కావడం. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు కావడంపై అంతటా ఆనందం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలు, సామాన్య ప్రజలు ఇలా అంతటా సంబరాలు చేసుకున్నారు. కానీ ఒక్క ప్రాంతంలో తప్ప. ఈ ప్రాంతమే హిందూపురం. ఎందుకంటే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పార్లమెంట్ కేంద్రం ఎక్కడ ఉంటే అక్కడే జిల్లా ఏర్పాటైంది. కానీ హిందూపురంలో మాత్రం అలా జరగలేదు. కానీ 2017లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నల్లమాడ బహిరంగ సభలో పుట్టపర్తిని ప్రత్యేక జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు సత్యసాయిబాబాకు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో పాటు పలు అంశాలు అనుకూలించడంతో పుట్టపర్తి వైపే మొగ్గు చూపారు.

హిందూపురం.. కానీ హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ ఉంది. దీనికి కారణాలు, సాంకేతిక అంశాలు కూడా లేకపోలేదు. అనంతపురం తర్వాత హిందూపురం పట్టణమే పెద్దది. అందునా హిందూపురం పేరుతో పార్లమెంట్ ఉంది. దీనికి తోడు పారిశ్రామీకరణ పరంగా కూడా చాలా డెవలప్‌మెంట్ కూడా ఉంది. లెక్క ప్రకారం చూస్తే ఇక్కడ జిల్లా ఏర్పాటు కావాలని అవుతుందని చివరి నిమిషం వరకు అంతా భావించారు. కానీ హిందూపురం వాసులు చెప్పేది భిన్నంగా ఉంది. కానీ ప్రభుత్వం పుట్టపర్తికి ఉన్న ప్లస్ పాయింట్లను, సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకుని అక్కడికి మార్చేసింది. దీంతో నిరసనలు ఒక్కసారిగా మిన్నంటాయి. హిందూపురంని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు రోడ్డెక్కారు. వందలాది మంది విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి హిందూపురం రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీ లో పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా ప్రకటిస్తామని సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

అన్ని పక్షాలు ఏకమై.. విద్యార్థులే కాదు వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు ఏకమయ్యాయి. ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకుని హిందూపురానికి జిల్లా కేంద్రాన్ని సాధించడమే లక్ష్యం పెట్టుకున్నారు. కనకదాసు కల్యాణ మండపంలో అన్ని వర్గాల వారితో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈనెల 29 బంద్ చేయాలని నిర్ణయించారు. సరిగ్గా ఇక్కడే సీన్ లోకి ఎంటర్ అయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సాధారణంగా వార్నింగ్‌లతో కామెంట్స్ చేసే.. బాలకృష్ణ కాస్త స్వరం మార్చారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామంటూనే దీనిపై రాజకీయం చేయవద్దని బాలకృష్ణ ప్రభుత్వానికి హితవు పలికారు. గతంలో ఇదే అంశంపై ప్రభుత్వానికి బాలకృష్ణ లేఖ కూడా రాశారు. కానీ అవన్నీ బేఖాతరు చేయడంపై ఫైర్ అయ్యారు. హిందూపురం పార్లమెంట్ కేంద్రంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పారని అయితే ఇప్పుడు ఎందుకు మాట మార్చారని ఆయన ప్రశ్నించారు. హిందూపురం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని.. ఇక్కడ పారిశ్రామికంగా కూడా మంచి పురోగతి సాధిస్తుందని ఇలాంటి చోట జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు జిల్లా కేంద్రంకి కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని ప్రభుత్వ భవనాలు ఇతర వాటికి అవసరమైన భూమి కూడా ఉందని బాలకృష్ణ స్పష్టం చేశారు.

మరింత రాజుకుంటున్న కొత్త జిల్లాల డిమాండ్.. ఇక్కడ వివాదం ఒక్కటే రెండవ జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ జిల్లా కేంద్రం పుట్టపర్తి కాకుండా హిందూపురం ఏర్పాటు చేయాలన్నదే డిమాండ్. బాలకృష్ణ కూడా అదే చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే.. కేవలం హిందూపురమే కాదు.. అటు మంత్రి శంకర్ నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండలో కూడా జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ గతంలో ఉంది. ఇప్పుడు ఈ ప్రాంత వాసులు కూడా ఇదే అంశాన్ని రైజ్ చేస్తున్నారు. మొత్తం మీద అనంతలో కొత్త జిల్లాల చిచ్చు మున్ముందు మరింత రగిలేలా చేస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

లక్ష్మికాంత్ రెడ్డి, టీవీ9 తెలుగు రిపోర్టర్..

Also Read:

Palnadu Politics: వైపీపీ Vs టీడీపీ.. పల్నాడులో ముదురుతున్న ఫ్లెక్సీల వివాదం.. పోలీసుల అప్రమత్తం..

Nellore: నెల్లూరులో అగ్నిప్రమాదం.. హైదరాబాద్‌ మహిళ సజీవ దహనం.. దర్గాకు వచ్చి..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ