AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు వంట చేయడంలో ప్రావీణ్యులు.. అందులో మీరున్నారా..

జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి చెప్పబడింది. జ్యోతిషశాస్త్రంలో ప్రతి వ్యక్తి సంబంధం ఏదో ఒక రాశితో సంబంధం కలిగి ఉంటాడు. దీని ప్రకారం రాశిచక్రానికి..

Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు వంట చేయడంలో ప్రావీణ్యులు.. అందులో మీరున్నారా..
Cooking Indian Women
Sanjay Kasula
|

Updated on: Jan 27, 2022 | 11:24 PM

Share

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి చెప్పబడింది. జ్యోతిషశాస్త్రంలో (astrology) ప్రతి వ్యక్తి సంబంధం ఏదో ఒక రాశితో సంబంధం కలిగి ఉంటాడు. దీని ప్రకారం రాశిచక్రానికి సంబంధించిన గ్రహం(horoscope) ఖచ్చితంగా ఆ రాశితో సంబంధం ఉన్న వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే జ్యోతిష్యులు రాశిని అడగడం ద్వారా వ్యక్తి అన్ని యోగ్యతలను దోషాలను గురించి చెబుతారు. ఇలాగే కొందరు అమ్మాయిలు(Girls) చేసే వంటలు అద్భుతంగా ఉంటాయి. అయితే ఇలాంటి వంటు చేయడంలో కొన్ని రాశులవారు ప్రావీణ్యులు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 4 రాశిచక్రాల అమ్మాయిలు వంటలో ప్రవీణులుగా పరిగణించబడతారు. అన్నపూర్ణ దేవి ప్రత్యేక అనుగ్రహం వీరిపై ఉంటుంది. వీరి వంట నైపుణ్యాల కారణంగా.. ఈ అమ్మాయిలు ఎవరి హృదయాన్ని అయినా చాలా సులభంగా గెలుచుకుంటారు.

మేషరాశి

మేషరాశి అమ్మాయిలకు వంటలో ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. వారి స్వభావం చాలా ఫన్నీగా ఉంటుంది. అందుకే ఈ వంట కూడా చాలా హ్యాపీగా చేస్తారు. రుచికరమైన వంటకాలు చేసి తినిపించడం ద్వారా వారు సంతృప్తిని పొందుతారు. దీని కారణంగా వారు చాలా త్వరగా  హృదయాలను గెలుచుకుంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి అమ్మాయిలు తన భర్త,  అత్తమామలను సంతోషంగా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఆమెకు ఇంటి పనులు చేయడం పెద్దగా ఇష్టం లేకపోయినా.. వంట పనిని చాలా చక్కగా నిర్వహిస్తుంది. పనిని వేగంగా నిర్వహిస్తుంది. రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం ద్వారా ప్రతి ఒక్కరి మనసులో సులభంగా చోటు సంపాదించుకుంటారు. ఆమె తన భర్తకు కూడా అదృష్టమని భావిస్తారు.

కన్య సూర్య రాశి

కన్యారాశి అమ్మాయిలు కాస్త ఉద్వేగానికి లోనై తమ విధులను చక్కగా నిర్వహిస్తారు. వారు ప్రతి సంబంధాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తారు. వారు తమ ప్రియమైన వారికి మంచి ఆహారం తినిపించడం, వారి కోసం కొత్త వంటకాలు చేయడం ఇష్టపడతారు. ఈ రాశీలోని అమ్మాయిలు ఈ పనిని గొప్ప పరిపూర్ణతతో చేస్తారు. అందుకే వారు ఎక్కడ నివసించినా అందరికి ప్రీతిపాత్రంగా మిగిలిపోతారు.

కుంభ రాశి

కుంభరాశి అమ్మాయిలు చాలా తెలివైనవారు. సంస్కారవంతులు, నిజాయితీపరులు, ప్రదర్శనకు దూరంగా ఉంటారు. వారి మనసులో ఏదైతే ఉందో అది వారి నాలుకపై ఉంటుంది. తీరిక సమయాల్లో రుచికరమైన వంటలు వండడం, కొత్త వంటకాలు చేయడం, ఆత్మీయులకు మనస్ఫూర్తిగా తినిపించడం అంటే చాలా ఇష్టం. అందుకే చాలా మంది ఆమెను అన్నపూర్ణ అని కూడా పిలుస్తారు. తన ప్రవర్తనతో ఎవరి మనసునైనా గెలుచుకోగలదు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

ఇవి కూడా చదవండి: PRC: చ‌ర్చ‌లకు రండి.. మీరు మా శ‌త్రువులు కాదు.. ఉద్యోగులకు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల సూచన..

TATA – Air India: ఎగిరిపో ఆకాశమే హద్దుగా.. టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా..