AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు..? పార్వతికి చెప్పిన కారణం ఇదే..

Lord Shiva: శివుడు సృష్టికి పూర్వం నుంచీ ఉన్నవాడు, సృష్టి అంతరించిన పిదపనూ నిలిచి ఉండేవాడు. ఆయనకు వయస్సు, ఆకారం, తల్లిదండ్రులు లేవు. ఆయన అరూప రూపి, లింగ స్వరూపం. సమస్త సృష్టిలో నిండి నిబిడీకృతమై ఉన్న శివుని స్వరూపం మానవ అవగాహనకు అందనిది, కాలాతీతమైనది.

Lord Shiva: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు..? పార్వతికి చెప్పిన కారణం ఇదే..
Lord Shiva
Rajashekher G
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 5:47 PM

Share

మహా శివుడు (Lord Shiva) సృష్టి లయకారుడు, ఆదిమధ్యాంత రహితుడు. శివుడు ఎవరికంటే ముందు పుట్టాడు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆయన పుట్టలేదు, స్వయంభువుగా ఉన్నవాడు. సమస్త సృష్టి తనలోకి లయం చేసుకుని, అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా నిలిచి ఉండేవాడు ఆయనే. అందువల్ల ఆయనకు వయస్సు అనే పరిమితి లేదు, కాలాతీతమైనవాడు. శివుని అద్వితీయమైన స్వభావం, ఆయన ఉనికిని వివరించే ప్రయత్నమే ఈ విశ్లేషణ.

ప్రాపంచిక కొలమానాలకు అతీతుడు

పైకి చూసేవారికి శంకరుడు తన గురించి తాను చేసుకునే నిందగా కనిపించినా, అది ఆయన అగోచరమైన తత్వాన్ని తెలియజేస్తుంది. “చిన్నారులలో చిన్నవాడు”, “ఏనాటివాడో ఎరుక లేదు” అని వర్ణించే ఆయన ఆకారాన్ని ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరు. ఆయన 63 లీలామూర్తులను ధరించినా, అంతిమంగా అరూపరూపిగా, లింగ స్వరూపంగా ఉంటాడు. సమస్త ప్రపంచంలో నిండిన ఆయన నిజమైన రూపం మానవులకు అందనిది.

ఆయనకు కులం, గోత్రం వంటి ప్రాపంచిక బంధాలు లేవు. ఆయనకు తల్లిదండ్రులు లేరు, పుట్టుక లేదు. ఒకవేళ పుట్టుకంటూ ఉంటే తల్లిదండ్రులు ఉంటారు. కానీ శివునికి పుట్టుక అనేది లేదు. ఆయన మహానుభావుడు, ఆది అంతరహితుడు, శాశ్వతుడు. ఆయన ఉనికి సాధారణ ప్రాపంచిక కొలమానాలకు అతీతమైనది.

శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు..?

శివుడు స్మశానవాసిగా ఉండటానికి ప్రధాన కారణం..స్మశానం అనేది భౌతిక బంధాలు, అహంకారం, అబద్ధాలు లేని పరమసత్యమైన ప్రదేశం కావడమే. సృష్టి-లయకారుడైన శివుడు మృత్యువును, నశ్వరమైన జీవితాన్ని దాటి నిత్య సత్యాన్ని (కైవల్య పదం) సూచించడానికి స్మశానంలో నివసిస్తాడు.

స్మశానంలో చనిపోయినవారిని దహనం చేసి అందరూ వెళ్లిపోయిన తర్వాత చచ్చినవాడు తనకు ఎవరూ లేరని భయంతో ఉంటాడని.. అందుకే వారికి నేనున్నాని చెప్పడానికే శివుడు స్మశానంలో ఉంటాడు. చచ్చినవాడు భయంతో మరోసారి చావకుండా ఉండేందుకే తాను ఇక్కడ ఉన్నానంటూ పార్వతికి శివుడు చెప్పినట్లుగా ప్రముఖ ఆత్యాత్మక గురువు చాగంటి ఓ సందర్భంలో తెలియజేశారు.

కారణాలు..

పరమసత్యం: స్మశానంలో ఎవరూ నటించలేరు, అక్కడ పేరు, ప్రతిష్టలకు విలువ లేదు. శివుడు అహంకారం లేని స్వచ్ఛమైన ఆత్మను ప్రేమిస్తాడు. మాయావిరహితుడు: బంధాలు, ప్రేమ, ఆశలనే నాటకం ముగిసి, శరీరం భస్మమయ్యే ప్రదేశం అది. భౌతిక విషయాల పట్ల విరక్తిని, అశాశ్వతత్వాన్ని శివుడు స్మశానవాసం ద్వారా తెలియజేస్తాడు. లయకారుడు: శివుడు సృష్టిని అంతం చేసేవాడు, కాబట్టి జీవులు తిరిగి పరమాత్మలో కలిసే స్థానమైన శ్మశానానికి ఆయనే అధిపతి. నిర్గుణుడు: భస్మాన్ని ఒంటికి రాసుకోవడం, స్మశానంలో ఉండటం ద్వారా మనిషికి నిజమైన భక్తి, త్యాగం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతాడు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us