Telangana: ‘కొంచెం తెలుసుకుని మాట్లాడండి’.. వైఎస్ షర్మిలకు వినోద్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్..

Telangana: రైతు బీమా విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైఎస్ షర్మిలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి..

Telangana: ‘కొంచెం తెలుసుకుని మాట్లాడండి’.. వైఎస్ షర్మిలకు వినోద్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్..
Follow us

|

Updated on: Jan 28, 2022 | 4:33 PM

Telangana: రైతు బీమా విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైఎస్ షర్మిలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్. కొంచె తెలుసుకుని మాట్లాడండి అంటూ చురకలంటించారు. షర్మిలది పూర్తిగా అవగాహనా రాహిత్యం అని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ హితవు చెప్పారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ఆర్ టీపీ నాయకురాలు షర్మిల రైతు బీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని, ముందుగా వాస్తవాలు తెలుసుకుని ఆ తర్వాత రైతు బీమా విషయంపై మాట్లాడాలి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు విజయవంతంగా రాష్ట్రంలో అమలు అవుతున్నాయన్నారు.

రైతు బీమా విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించి అమలు చేస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు. ఎల్ఐసి, జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్న వారికే బీమా సౌకర్యం ఉందని, ఆ నిబంధనల ప్రకారమే రైతు బీమా పాలసీ చేయించామని ఆయన అన్నారు. కేంద్రం, పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఇన్సూరెన్స్ సహా వివిధ పథకాలు 60 ఏళ్ల లోపు ఉన్న వారికే వర్తిస్తున్నాయని, ఈ విషయం మీకు తెలియదా..? అని వైఎస్ షర్మిలను ప్రశ్నించారు. వాస్తవాలేవీ తెలియకుండా షర్మిల తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు వినోద్ కుమార్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇలాంటి పథకాలను షర్మిల మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలు చేస్తే ఎలా? అని అన్నారు.

Also read:

Viral Video: స్నేహం అంటే ఇదే రా.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన ఫ్రెండ్‌ను రక్షించిన కుక్క..

Telangana: ‘ఆపరేషన్ డ్రగ్స్’.. ఈ సారి తగ్గేదే లే అంటున్న తెలంగాణ సర్కార్.. ప్రత్యేక యాప్‌తో..

Wipro hiring 2022: విప్రో బంపర్ ఆఫర్..! కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళా నిపుణులకు ఆహ్వానం పలుకుతోన్న ఐటీ సంస్థ..