AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్నేహం అంటే ఇదే రా.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన ఫ్రెండ్‌ను రక్షించిన కుక్క..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో..

Viral Video: స్నేహం అంటే ఇదే రా.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన ఫ్రెండ్‌ను రక్షించిన కుక్క..
Dog Save Life Of Drowned Doggy Video
Sanjay Kasula
|

Updated on: Jan 28, 2022 | 4:26 PM

Share

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ  కుక్క స్విమ్మింగ్ పూల్‌లో పడిపోవడం కనిపిస్తుంది. కుక్కను రక్షించడానికి దాని యజమాని స్విమ్మింగ్ పూల్‌లోకి దూకడం మీరు తరచుగా చూసి ఉంటారు. కానీ ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. దానికి సహాయం చేయడానికి మరొక కుక్క ముందుకు వచ్చింది. ఈ సీన్ సినిమాలోని సన్నివేశంలా అనిపిస్తుంది. చివరికి, కుక్క తన స్నేహితుడిని నీటి నుండి బయటకు తీసుకురావడానికి ఎంతటి సహాయం చేస్తుందో చూడవచ్చు. ఈ వీడియో నెటిజన్లకు ఫేవరెట్‌గా మారింది.

ఈ వైరల్ వీడియోలో ఓ తెల్లని కుక్క స్విమ్మింగ్ పూల్ వెంబడి పరిగెత్తుకుంటూ వచ్చి అందులో జారి పడిపోతుంది. దీని తర్వాత కుక్క బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇలా ఈత కొట్టి కొట్టి అలిసిపోతుంది. దాని అరుపులు విన్న మరో కుక్క పరుగు పరుగునా అక్కడికి వస్తుంది. దానిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.. ఇలా ఆ కుక్క దాదాపు 34 నిమిషాలాపటు ప్రయత్నించి చివరికి సక్సెస్ అవుతుంది.

అయితే చివరగా ఆ తెల్ల కుక్కచెవిని నోటితో పట్టుకుని బయటకు లాగుతుంది. ఈ దృశ్యం మొత్తం ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను ఆ ఇంటి యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలను షేర్ చేస్తున్నారు. స్నేహితుడిని కాపాడిన కుక్కపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Viral Video: ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా..? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం..

Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు వంట చేయడంలో ప్రావీణ్యులు.. అందులో మీరున్నారా..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ