AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘ఆపరేషన్ డ్రగ్స్’.. ఈ సారి తగ్గేదే లే అంటున్న తెలంగాణ సర్కార్.. ప్రత్యేక యాప్‌తో..

Telangana - Drugs Case: పిచ్చి మొక్కలకు అడ్డంగా పెరిగిన కొమ్మలను ఎన్నిసార్లు నరికినా కొత్త కొమ్మలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

Telangana: ‘ఆపరేషన్ డ్రగ్స్’.. ఈ సారి తగ్గేదే లే అంటున్న తెలంగాణ సర్కార్.. ప్రత్యేక యాప్‌తో..
Vijay Saatha
| Edited By: Shiva Prajapati|

Updated on: Jan 28, 2022 | 4:25 PM

Share

Telangana – Drugs Case: పిచ్చి మొక్కలకు అడ్డంగా పెరిగిన కొమ్మలను ఎన్నిసార్లు నరికినా కొత్త కొమ్మలు పుట్టుకొస్తూనే ఉంటాయి. సమస్య పూర్తిగా సమసిపోవాలంటే.. వేళ్లతో సహా పెకిలించాల్సిందే. అవును.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాను అమలు చేయబోతుంది. డ్రగ్స్ అనే పదాన్ని.. హైదరాబాద్‌లోనే వినపడకుండా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. డ్రగ్స్‌ను ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు. డీజీపీ, కమీషనర్లు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. డిమాండ్‌ని తగ్గిస్తేనే సప్లై ఆగిపోతుందనేది ప్రభుత్వం అభిప్రాయం. దీంతో సీఎం కేసీఆర్ ముందు పోలీసులు కీలక ప్రతిపాదనలు ఉంచారు.

‘‘స్మగ్లర్ల గుట్టు డోపం యాప్ కే ఎరుక’’ డోపం యాప్‌ని ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా.. డ్రగ్స్ కంట్రోల్ కోసం ప్రత్యేకంగా తెలంగాణ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్ తెచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. డ్రగ్స్ కోసం ఆర్డర్ చేస్తే అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు. డ్రగ్ ముఠాలు, సైబర్‌ నేరగాళ్లు ఓ ప్రాంతంలో నేరానికి పాల్పడితే ఆ సమాచారం అక్కడితోనే ఆగిపోతోంది. మళ్లీ ఇంకో ప్రాంతంలో నేరం చేసినప్పటికీ పాత నేరం గురించి పోలీసులకు తెలియడం లేదు. డీఆర్‌ఐ, ఎన్‌సీబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతోపాటు ఆయా రాష్ట్రాల శాంతిభద్రతల పోలీసులకు చిక్కుతున్న ముఠాల సమాచారం కూడా ఆయా ఏజెన్సీలకే పరిమితమవుతోంది. ఆయా ముఠాల్లోని స్మగ్లర్ల గురించిన సమాచారం అందరికీ అందుబాటులో లేకపోవడంతో డ్రగ్ ముఠాల ఆటలు సాగుతున్నాయి.

కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ యాప్‌ పనిచేయనుంది. నార్కొటిక్‌ యాక్ట్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులకు సంబంధించిన వివరాల్ని ఈ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 746 పోలీస్‌స్టేషన్లలో ఈ యాప్‌ను అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే మనుగడలో ఉన్న టీఎస్‌-కాప్‌ యాప్‌కు డోపమ్స్‌ యాప్ కూడా లింకప్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు పోలీసులు.

ఒక్కసారి డ్రగ్స్ కేసులో పట్టుపడితే.. అతని పేరు, ఊరుతో పాటు బంధువులు, సన్నిహితుల వివరాలు అందులో అప్‌లోడ్ చేస్తారు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి డ్రగ్స్ సేకరిస్తాడు? ఎక్కడికి తరలిస్తాడు? డ్రగ్స్ వినియోగిస్తాడా.. లేక సప్లై చేస్తాడా? ఎవరెవరికి సప్లై చేశారు? ఇప్పటివరకు ఎన్ని కేసుల్లో ప్రమేయముంది? ఇలాంటి వివరాలన్నీ ఆ యాప్‌లో డీటెయిల్డ్‌గా ఉంటాయి.

డోపమ్స్‌లో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోని స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలనూ నమోదు చేయనున్నారు. ఇందుకోసం CCTNS.. అంటే Crime and Criminal Tracking Network & Systems డేటా కూడా లింక్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 14,368 స్టేషన్లలోని స్మగ్లర్ల వివరాలు డోపమ్స్‌లో నమోదు అయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ ముఠా ఎక్కడ పట్టుబడినా.. అతని సమాచారం తెలుసుకునేందుకు డోపమ్స్‌ వేదిక కానుంది. ఒక స్మగ్లర్‌ నార్కోటిక్ డ్రగ్ కేసులో చిక్కితే అతడి గత చరిత్రను అక్కడికక్కడే తెలుసుకునేందుకు ఈ యాప్‌ వీలు కల్పిస్తుంది. పదేపదే నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు రెడీ అయ్యారు పోలీసులు. ఈ మొత్తం తీగను లాగి.. అందరికీ బుద్ధి చెప్పాలంటే.. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also read:

Wipro hiring 2022: విప్రో ’బిగిన్ ఎగైన్‌‘ ప్రోగ్రాం.. కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళా నిపుణులకు ఆహ్వానం పలుకుతోన్న ఐటీ సంస్థ..!

Kevin Pietersen: భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవాలనుంది.. సమయం కోసం ఎదురు చూస్తున్నా..

Adipurush: ఆదిపురుష్ పాన్ ఇండియా కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ సినిమా.. ఇదిగో సాక్ష్యం ఇదే..