రుతుపవనాలు సాధారణంగా భారతదేశంలో ద్వీపకల్ప ప్రాంతంతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో వర్షపాతాన్ని మోసుకొస్తాయి. పశ్చిమ, వాయువ్య రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షపాతం మిగతా ప్రాంతాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది దేశంలోని మిగతా ప్రాంతాల కంటే ఈ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. థార్ ఎడారి పచ్చగా మారుతుందని చెప్పేందుకు రుతుపవనాల గతిశీలతను అర్థం చేసుకోవడం కీలకమని గౌహతిలోని కాటన్ విశ్వవిద్యాలయం ఫిజిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బీఎన్ గోస్వామి చెబుతున్నారు