రైలు ప్రయాణంలో ఈ తప్పులు చేస్తే ఏమవుతుందో తెలసా? జరిమానా, జైలు శిక్ష!

09 January 2025

Subhash

భారతీయ రైల్వేలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కానీ ఈ తప్పులు సమస్యలుగా మారే అవకాశం ఉంది. దీని కారణంగా అతనికి జరిమానా విధించబడుతుంది. 

 రైల్వేలో

రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు చెత్తాచెదారం వేస్తారు. స్టేషన్‌లో చెత్తాచెదారం వేస్తూ పట్టుబడితే రూ.500 జరిమానా విధిస్తారు. అందుకే రైల్వే స్టేషన్‌లలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

స్టేషన్‌లో

అలాగే రైల్వే లైన్ దాటుతూ పట్టుబడితే లేదా రైల్వే ప్రాంగణంలో గొడవలకు దిగినా రైల్వే అధికారులు పరిశీలిస్తుంటారు. 

రైల్వే లైన్

వీటిలో ఏదైనా చేస్తూ పట్టుబడితే, మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. కారణం లేకుండా ట్రైన్‌లో చైన్‌ లాగి రైలును ఆపితే అది కూడా నేరమే. మీరు జైలుకు కూడా వెళ్లవచ్చు.

జరిమానా 

రైలులో బిగ్గరగా మాట్లాడటం, గొడవలు చేయడం, ఇతర ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించినా కూడా శిక్షార్హులే.

బిగ్గరగా మాట్లాడటం

రైలులో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) చెకింగ్‌ కోసం వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటం, దురుసుగా ప్రవర్తించినట్లయితే, భారతీయ రైల్వే మీపై కూడా చర్య తీసుకోవచ్చు. 

రైలులో

కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్ అంచున నిలబడటం, మీరు పసుపు గీతను దాటడం చేస్తుంటారు. అలా చేసిన పొరపాటే. రైల్వే చట్టంలోని సెక్షన్ 147 ప్రకారం రూ. 500 జరిమానా.

ప్లాట్‌ఫారమ్

కొన్నిసార్లు రైలు రద్దీగా ఉన్నప్పుడు పురుషులు, మహిళలు వారి కోచ్‌లో కాకుండా ఇతర కోచ్‌లలో ఎక్కుతారు. లేదా వికలాంగుల కోచ్‌లో కూర్చుఉంటారు. అలా చేసిన తప్పే. జరిమానాతో పాటు జైలు శిక్ష విధించవచ్చు.

రద్దీగా