రోజూ అరటిపండ్లు, గుడ్లు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా

09 January 2025

Pic credit-Pexel

TV9 Telugu

వ్యాధుల నుంచి రక్షణ కోసం ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉన్న ఆహారం తీసుకోవడం ప్రారంభించండి. చాలా మంది ఆహారంలో అరటిపండ్లను, గుడ్లు తినడానికి ఇష్టపడతారు.

ఆరోగ్యకరమైన ఆహారం

అరటిపండులో విటమిన్ బి6, సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ , ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

అరటి పోషకాలు

ప్రోటీన్, విటమిన్ బి12, డి, జింక్, సెలీనియం, కాల్షియం, రైబోఫ్లావిన్, పొటాషియం వంటి మూలకాలు గుడ్లలో ఉంటాయి.

గుడ్లలో పోషకాలు

ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లోని డైటీషియన్ జయ జ్యోత్స్న చెప్పారు.

నిపుణుల అభిప్రాయం

రోజూ గుడ్డుతో అరటిపండు తింటే విటమిన్ బి12 పెరుగుతుంది. కనుక ఆరోగ్యకరమైన అల్పాహారంగా పరిగణించబడుతుంది

విటమిన్ బి12

అరటిపండు, గుడ్డు తినడం వల్ల శరీరానికి మెగ్నీషియం, కాల్షియం అందుతాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. 

ఎముకలు దృఢంగా మారతాయి

అరటిపండుతో గుడ్డు తినడం వల్ల కండరాలు కూడా వేగంగా పెరుగతాయి. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల వేగవంతమైన పెరుగుదలకు సహాయపడుతుంది.

కండరాల పెరుగుదలకు