- Telugu News Photo Gallery Spiritual photos Financial benefits for these zodiac signs on the day of Shri Krishna Janmashtami
శ్రీ కృష్ణ జన్మాష్టమి .. కుభేరులయ్యే రాశుల వారు వీరే!
శ్రీ కృష్ణ జన్మాష్టమి వచ్చేస్తుంది. ఆగస్టు 16 శని వారం రోజున ప్రతి ఒక్కరూ ఈ జన్మాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అంతే కాకుండా ఈ రోజున బుధాదిత్య యోగం ఉండటం వలన నాలుగు రాశుల వారు కుభేరులు అవ్వడం ఖాయం. శ్రీ కృష్ణ జన్మాష్టమి నాలుగు రాశుల వారికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని చెబుతున్నారు పండితులు. దాని గురించే పూర్తిగా తెలుసుకుందాం.
Updated on: Aug 12, 2025 | 11:41 AM

హిందూ పండుగల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పండుగ రోజున ఉపవాసం ఉంటమే కాకుండా, ఉట్టి కొట్టడం, శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అయితే 2025వ సంవత్సరంలో ఈ పండుగను ఆగస్టు 16న ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అయితే ఈ సారి జన్మాష్టమి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట. అవి ఏ రాశులంటే?

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి జన్మాష్టమి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇది వీరికి చాలా ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎందుకంటే శ్రీ కృష్ణుడు ఈ రాశి వారిపై వరాలు కురిపిస్తాడు. వీరికి జన్మాష్టమి, బుధాదిత్య యోగం వలన వ్యాపరంలో పురోగతి, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

ధనుస్సు రాశి : ధనస్సు రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలబోతున్నాయి. శ్రీ కృష్ణుడు ఈ రాశి వారికి సిరులు కురిపించనున్నాడు. దీని వలన వీరు పనుల్లో విజయం సాధించడం, సంపద పెరగడం, పెట్టుబడుల్లో లాభాలు రావడం జరుగుతుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభిస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది.

తుల రాశి : తుల రాశి వారికి అనుకోని విధంగా ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి అప్పుల సమస్యతో బాధపడతారో వారి సమస్యలు తీరిపోతాయి. అంతే కాకుండా అనేక మార్గాల ద్వారా డబ్బు చేతికందడం వలన వీరి చేతినిండా డబ్బే డబ్బు ఉంటుంది.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఉద్యోగంలో విజయం లభిస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మీరు కొత్త ఉద్యోగాన్ని కూడా ప్రారంభించవచ్చు. ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మొత్తం మీద, ఈ జన్మాష్టమి మీకు ప్రత్యేకంగా ఉండబోతుంది.



