Health Tips: పల్లీలు తినేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే తిప్పలు తప్పవు
వేరు శనగలు మన ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు అందిస్తాయి. అందులే వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. కానీ వీటిని ఎలా తింటే వాటి ప్రయోజనాలను పొందగలం అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. దీని వల్ల వారు తమ డబ్బును, సమయాన్ని వృదా చేసుకుంటారు. కాబట్టి వీటిని ప్రయోజనరంగా ఎలా తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Updated on: Sep 30, 2025 | 2:59 PM

హెల్త్‌లైన్ ప్రకారం 100 గ్రాముల ముడి వేరుశెనగలో 567 కేలరీలు, 6.5% నీరు, 25.8 గ్రాముల ప్రోటీన్, 16.1 కార్బోహైడ్రేట్లు, 4.7 గ్రాముల చక్కెర, 8.5 గ్రాముల ఫైబర్, 15.56 గ్రాముల ఒమేగా-6, బయోటిన్, కాపర్, నియాసిన్, ఫోలేట్, మాంగనీస్, విటమిన్ E, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు మరియు పోషకాలతో పాటు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అనే రకాలుగా ఉపయోగపడుతాయి.

శనగలను తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటిని సరైన పద్దతిలో తీసుకోకపోతే.. మనం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.కాబట్టి మీరు పల్లీలు పరిమిత పరిమాణంలో సరైన మార్గంలో ఆహారంలో చేర్చుకోవాలి. మితంగా తీసుకుంటే వేరుశెనగలు ప్రోటీన్‌కు మంచి మూలం. కానీ వాటిని అమితంగా తీసుకుంటే ఆమ్లత్వం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా శీతాకాలంలో పల్లీలు తినడానికి ముందు వేరుశెనగలను నానబెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. రాత్రిపూట 20 నుండి 25 వేరుశెనగలను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం తినండి. ఇలా చేయడం వలన మీరు వాటి ప్రయోజనాలను పొందవచ్చు.

వేరుశనగ పప్పుల్లో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వేరుశనగ పప్పులను సుగంధ ద్రవ్యాలతో కలిపి తినకూడదు. మీకు ఈ గింజలకు సంబంధించిన ఏవైనా అలెర్జీలు, ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణుడిని సంప్రదించవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




