Kitchen Hacks : అల్లంపై పొట్టు తీసేందుకు తెగ కష్టపడిపోతున్నారా..? ఈ సింపుల్‌ ట్రిక్‌ ఫాలో అయిపోండి

వంటల్లో కాస్తింత అల్లం ముక్క వేస్తే ఆ రుచే వేరు. ఆహారానికి రుచే కాకుండా ఔషధంగా కూడా అల్లం బలేగా పనిచేస్తుంది. అయితే అల్లంపై ఉండే పొట్టు అంత సులువుగా ఉడిరాదు. దీనిని తొలగించడం గృహిణులకు పెద్ద టాస్కే. అయితే ఈ కింది సింపుల్ చిట్కాల ద్వారా అల్లంపై పొట్టు సులువుగా తొలగించవచ్చు..

Srilakshmi C

|

Updated on: Nov 13, 2024 | 9:34 PM

వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా అన్ని రకాల వంటల్లో అల్లం తప్పనిసరి. ఔషధ గుణాలున్న అల్లాన్ని కేవలం వంటకే కాకుండా అనారోగ్య సమస్యలకు కూడా ఔషధంగా ఉపయోగపడుతుంది. వంటింట్లో అందరికీ అందుబాటులో ఉండే అల్లంతో టీ పెట్టుకుని తాగడానికి కొంతమంది ఇష్టపడతారు.

1 / 5
అల్లం ఎంత శుభ్రంగా ఉన్నా సరే.. ఎక్కడ మట్టి, ఇసుక ఉంటాయో అన్న అనుమానంతో దానిపై ఉండే పొట్టుని కూడా వలుస్తుంటాం. ముఖ్యంగా దీన్ని వంటకు ఉపయోగించే ముందు తొక్క తీసేయడం చాలా మందికి అలవాటు. ఈ పొట్టు అతుక్కొని ఉండడం వల్ల తొలగించడం చాలా చికాకు కలిగించే పని.

2 / 5
అల్లం నేలలో పెరుగుతుంది కాబట్టి. దానిని బాగా కడగాలి. ఇలా పొట్టుని తీయడానికి సాధారణంగా చేతి గోళ్లనే ఎక్కువగా వినియోగిస్తుంటాం. లేదంటే చెంచాతో. అయితే కాసేపు నీళ్లలో నానబెట్టి ఉంచితే అల్లం సులువుగా ఒలిచిపోతుంది.

3 / 5
కత్తితో పై తొక్క తీస్తే, సగం అల్లం తొక్కతోనే వెళుతుంది. కాబట్టి దానిని పీల్ చేయడానికి ఒక చెంచా ఉపయోగించడం ఉత్తమ మార్గం. చెంచా ముందు భాగాన్ని ఉపయోగించి అల్లం పొట్టు తీయొచ్చు. అలాగే అల్లంని కాసేపు వేడి నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత చేతితో కూడా సులువుగా అల్లం తొక్కతీయవచ్చు.

4 / 5
వండడానికి అరగంట ముందు అల్లం ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే పై తొక్క మృదువుగా మారుతుంది. కత్తి సహాయంతో సులభంగా దీనిని తొలగించవచ్చు. అంతేకాకుండా అల్లం పొట్టు తీసే పనిముట్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఉపయోగించి కూడా అల్లం పై పొరను సులువుగా తొలగించవచ్చు.

5 / 5
Follow us