చర్మం నిగనిగలాడాలని, ముడతలు పడకూడదని కోరుకుంటున్నారా? వృద్ధాప్యం త్వరగా మీద పడకూడదని భావిస్తున్నారా? అయితే రోజూ దానిమ్మ పండు తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
మనకు అవసరమైన అన్ని పోషకాలు దానిమ్మ పండ్లలో దండిగా ఉంటాయి. విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధకాలతో పాటు వృద్ధాప్యం త్వరగా ముంచుకు రాకుండా చూసే గుణాలూ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి
TV9 Telugu
ఇవి చర్మం నిగనిగలాడటానికీ తోడ్పడతాయి. దానిమ్మ గింజల్లోని నూనె చర్మం పైపొరను (ఎపిడెర్మిస్) బలోపేతం చేస్తుంది. ఫలితంగా ముడతలు పడటమూ తగ్గుతుంది
TV9 Telugu
చర్మం ముడతలు పడేది పైపొరలోనే మరి! ఒక్క చర్మ సౌందర్యం ఇనుమడించేలా చేయటమే కాదు.. వయసుతో పాటు ఇబ్బంది పెట్టే రక్తపోటు, కీళ్లనొప్పులనూ దానిమ్మ పండ్లు తగ్గిస్తాయి
TV9 Telugu
దానిమ్మలో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది. ఇదే కాకుండా ఐరన్, విటమిన్ B6, మెగ్నీషియం, ఫైబర్, కాల్షియం, పొటాషియం దానిమ్మలో అత్యధికంగా ఉంటాయి
TV9 Telugu
దానిమ్మ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తప్పనిరిగా తీసుకోవాలి. రక్తపోటు సమస్యలు ఉన్నవారు దానిమ్మను తినడం వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు
TV9 Telugu
ఎందుకంటే ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపు చేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు వారు కూడా రోజూ దానిమ్మపండు తింటే హిమోగ్లోబిన్‌ని పెంచి శక్తిని అందిస్తుంది. తరచుగా అనారోగ్యంతో బాధపడేవారు రోజూ దానిమ్మను తినడం మంచిది
TV9 Telugu
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దానిమ్మ రక్తపోటును నియంత్రించి, రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది
TV9 Telugu
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దానిమ్మ రక్తపోటును నియంత్రించి, రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది