Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ప్రసారభారతి నుంచి ఓటీటీ సేవలు.. ప్రత్యేకతలు ఏంటంటే..

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ సేవల సరసన ఇప్పుడు ప్రసార భారతి కూడా రాబోతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రసార భారతి ఓటీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ ఓటీటీ సేవల ప్రత్యేకతలు ఏంటంటే..

OTT: ప్రసారభారతి నుంచి ఓటీటీ సేవలు.. ప్రత్యేకతలు ఏంటంటే..
Prasra Bharti Ott
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 14, 2024 | 6:39 AM

ఓటీటీ అనగానే నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వంటి ప్రైవేట్ ఓటీటీ సంస్థల పేర్లే గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు ఈ రంగంలోకి ప్రభుత్వ సంస్థ ప్రసార భారతి కూడా వచ్చి చేరుతోంది. ప్రసారభారతి ఓటీటీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రసార భారతి ఓటీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారికంగా ప్రకటించారు.

ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రసార భారతి ఓటీటీని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. దూరదర్శన్‌ ఫ్రీ డిష్‌లో అందుబాటులో ఉన్న 60 చానళ్లు.. ఇకపై ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులోకి రానున్నాయని అన్నారు. అలనాటి సినిమాలు, ఆల్‌టైమ్‌ హిట్‌ ప్రోగ్రామ్స్‌ను ఈ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన ఇండియా గేమ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి ఈ విషయాలను తెలిపారు.

కాగా మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన గేమింగ్‌ డెవలపర్లు, నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్‌ జాజు మాట్లాడుతూ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ టెక్నాలజీ ద్వారా వీడియో గేమింగ్‌ రంగంలో నైపుణ్యాభివృద్ధికి సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ రంగాల్లో పని చేస్తున్న వారిని ప్రోత్సహించడానికి ఈ ఇనిస్టిట్యూట్‌ను నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. సమీప భవిష్యత్తులో భారత్‌ ప్రపంచ గేమింగ్‌ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

అలాగే 2025 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరిగే వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌(వేవ్స్‌) గురించి మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో ప్రైవేట్‌ ఎఫ్‌ఎం రేడియో ఛానళ్లను వేలం వేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇలా మొత్తం 237 స్థానిక ప్రైవేట్‌ ఎఫ్‌ఎం రేడియో చానళ్లను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ త్వరలో వేలం వేయనుందని తెలిపారు. దీంతో ఆదిలాబాద్‌ లాంటి పట్టణాల్లో కూడా ఎఫ్‌ఎం స్టేషన్స్‌ అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..