అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా.. అరెస్ట్ వదంతులతో భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు!
అర్ధరాత్రి క్రిందకు వచ్చిన కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడి వెళ్లారు. తెల్లవారుజామున 4 గంటల వరకు కేటీఆర్ ఇంటి వద్ద BRS కార్యకర్తలు చేరుకుంటూనే ఉన్నారు.
అర్థరాత్రి కేటీఆర్ అరెస్ట్ అంటూ ప్రచారంతో హైదరాబాద్‌లో ఒక్కసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందనన ప్రచారం కలకలం రేపింది. అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. హైదరాబాద్ నందినగర్ కేటీఆర్ ఇంటి వద్ద చేరుకున్న కార్యకర్తల కేటీఆర్‌కు సంఘీభావం తెలిపారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతల హస్తం ఉందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఏ క్షణానైనా కేటీఆర్‌ను సైతం అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ వార్త దహనంలా వ్యాపించడంతో కేటీఆర్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ అగ్రనేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
కేటీఆర్‌ను కలిసిన పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. ‘కేటీఆర్‌ను ముట్టుకోకముందే మమ్మల్ని ఎదుర్కోవాలి’ అనే నినాదాలు నివాసం వెలుపల నిలబడితే జనం నుంచి వినిపించాయి. అర్ధరాత్రి క్రిందకు వచ్చిన కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడి వెళ్లారు. తెల్లవారుజామున 4 గంటల వరకు కేటీఆర్ ఇంటి వద్ద BRS కార్యకర్తలు చేరుకుంటూనే ఉన్నారు. పోలీసులు వస్తారని, పార్టీ కార్యకర్తలు ఎదురుచూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన నివాసం వెలుపల జనం అప్రమత్తంగా ఉన్నారు. కార్యకర్తకు తమ మద్దతును తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..